క్రీడాభూమి

కివీస్‌పై ఆసీస్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, ఫిబ్రవరి 21: ఇక్కడి ఈడెన్ పార్క్‌లో బుధవారం జరిగిన టీ-20 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌ను 19 పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసినా, వరుణుడి రూపంలో ఆటకు ఆటంకం ఏర్పడడంతో డక్ అండ్ లూయిస్ పద్ధతిలో విజయం ఆస్ట్రేలియాను వరించింది. వర్షం ఎప్పటికీ తగ్గే సూచనలు కనిపించక పోవడంతో ఎంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోని పొట్టి ఫార్మాట్‌లో గెలుపు ద్వారా ఆస్ట్రేలియా ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కీలక సమయంలో వికెట్లు తీసిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఆస్టన్ ఆగర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం గొప్పగా రాణించిన గ్లెన్ మాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. గత శుక్రవారం ఇదే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 243 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లోతొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 150 పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. ప్రత్యర్థి బౌలర్లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. న్యూజిలాండ్ జట్టులో రాస్ టేలర్ ఒక్కడే దాదాపు అర్ధ శతకం చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన విధంగా రాణించలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మార్టిన్ గుప్తిల్ 15 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 21 పరుగులు చేసి, స్టాన్‌లేక్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కొలిన్ మన్రో 14 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 29 పరుగులు చేసి, రిచర్డ్సన్ బౌలింగ్‌లో ఆగర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో కేవలం తొమ్మిది పరుగులు సాధించి ఆగర్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. మార్క్ చాప్‌మన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఎనిమిది పరుగులు చేసి ఆగర్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. రాస్ టేలర్ 38 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు ఫోర్ల సహాయంతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో పది పరుగుల చేసి ఆగర్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. మిచెల్ సత్‌నర్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఆండ్రూ టై బౌలంగ్‌లో కార్వేకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ సైఫెర్ట్ ఎనిమిది బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి స్టోనిస్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. టిమ్ సౌతీ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఐదు పరుగులు చేసి కానే రిచర్డ్సన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇష్ సోధి 16 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 13 పరుగులు చేసి ఆండ్రూ టే చేతిలో బౌల్డ్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం తొమ్మిది వికెట్లకు న్యూజిలాండ్ 150 పరుగులు చేసింది.
ఇదిలావుండగా ఆస్ట్రేలియా జట్టులో కేన్ రిచర్డ్సన్ నాలుగు ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి రెండు వికెట్లు, ఆండ్రూ టే నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. బిల్లీ స్టాన్‌లేక్ నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి ఒక వికెట్, మెర్క్యూస్ స్టోనిస్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 14 ఓవర్ జరుగుతున్న సమయంలో వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. అప్పటికే 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 121 పరుగులు చేసింది. ఈ టీమ్‌లో డీ ఆర్సీ షార్ట్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ 23 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సహాయంతో 25 పరుగులు చేసి ఇష్ సోధి చేతిలో బౌల్డ్ అయ్యాడు. డి ఆర్టీ షార్ట్ 30 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 50 పరుగులు చేసి మున్రో బౌలింగ్‌లో చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 18 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆరోన్ పింఛ్ 13 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ జట్టులో ఇష్ సోధి, మిచెల్ సంత్‌నర్, కొలిన్ మన్రో చెరో వికెట్ సాధించారు.
స్కోరు బోర్డు:
న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్ సి వార్నర్ బి, స్టాన్‌లాక్ 21 కొలిన్ మన్రో సి ఆగర్ బి, రిచర్డ్సన్ 29 కనే విలియమ్సన్ బి, ఆగర్ 9 మార్క చాప్మన్ ఎల్‌బీడబ్ల్యు బి, ఆగర్ 8 రాస్ టేలర్ నాటౌట్ 43, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సి మాక్స్‌వెల్ బి, ఆగర్ 10 మిచెల్ సంత్‌నర్ సి కారే బి, టై 0 టిమ్ సైఫెర్ట్ బి స్టోయిన్సిస్ 3 టిమ్ సౌథీ సి మాక్స్‌వెల్ బి, సౌథీ 5 ఇష్ సోధి బి, టై 13 ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 1. (150/9)
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్ బి సోధి 25, డి ఆర్సే షార్ట్ సి చాప్‌మన్ బి, మన్రో 50, ఆస్టాన్ ఆగర్ బి సంతన్‌నర్ 2, గ్లెన్ మాక్స్‌వెల్ నాటౌట్ 20, ఆరోన్ పింఛ్ నాటౌట్ 18. (121/3).

వారు ఓటమిని చవిచూడలే...
టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల ముక్కోణపు టోర్నీలో ఆస్ట్రేలియా ఓటమి ఎరుగకుండా సిరీస్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీ సేనను వెనకకు నెట్టేసింది. టీ-20 ముక్కోణపు టోర్నీలో అఖండ విజయం ద్వారా దాదాపు 15 పాయింట్లు ఎక్కువ సాధించిన ఆసీస్ ఐసీసీ ర్యాంకింగ్‌లో రెండో స్థానాన్ని చేరుకోగా, భారత్ 122 పాయింట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ-20 మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు. ఐసీసీ ర్యాంకింగ్‌లో పాకిస్తాన్ ఇప్పటికే 126 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ప్రతిష్టాత్మక టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 19 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా జట్టు షార్ట్ ఫార్మాట్‌లో తొలిసారిగా ప్రపంచ నెంబర్ టూ ర్యాంక్‌ను సాధించింది.

స్విస్ ఓపెన్ సూపర్ బాడ్మింటన్ టోర్నీ
రెండో రౌండ్‌కు
గురు, సౌరభ్, సమీర్
బసెల్, ఫిబ్రవరి 21: భారత బాడ్మింటన్ క్రీడాకారులు మరోసారి సత్తచాటారు. స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 బాడ్మింటన్ టోర్నమెంట్ మొదటి రౌండ్‌లో ప్రత్యర్థులపై విజయం సాధించి స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ రెండో రౌండ్‌కు ప్రవేశించిన వారిలో ఆర్‌ఎంవి.గురుసాయిదత్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మలున్నారు.
ఇక్కడ జరిగిన మొదటి రౌండ్‌లో కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకున్న గురుసాయిదత్ గాయల కారణంగా చికిత్స పొందిన అనంతరం టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు.
సాయిదత్ 21-16, 21-11 స్కోరు తేడాతో ప్రత్యర్థి బ్రెజిల్‌కు చెందిన యోర్ కోయిలోపై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో సౌరభ్ 21-11, 21-18తో మిషాజిల్‌బేర్మాన్‌పై , సౌరభ్ సోదరుడు సమీర్ వర్మ 22-20, 21-10 స్కోరు తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన థామాస్ రాక్సెల్‌పై పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో నెగ్గారు. రెండో రౌండ్ సింగిల్స్‌లో సమీర్ జపాన్‌కు చెందిన యు ఇగార్షీతో, సౌరభ్‌తో గురుసాయిదత్ తలపడునున్నారు.

సుల్తాన్ ఆజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీ
భారత పురుషుల జట్టు కెప్టెన్‌గా సర్దార్ సింగ్
మలేషియా, ఫిబ్రవరి 21: మలేషియాలో మార్చిలో జరుగనున్న ఆజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న భారత పురుషుల జట్టుకు సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొని, డిసెంబర్‌లో న్యూజిలాండ్‌లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్‌లో చోటుదక్కని సర్దార్ మంచి గొప్ప అవకాశం లభించింది. ప్రస్తుత భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు రెస్ట్ ఇవ్వడంతో సర్దార్‌కు మంచి ఆవకాశం లభించిందని జట్టు ఛీప్ కోచ్ జోర్డ్ మిరీన్ తెలిపారు. ఆజ్లాన్ షా కప్‌లో సర్దార్ సింగ్ చక్కగా రాణిస్తే త్వరలో జరుగనున్న కామనె్వల్త్, ఆసియా గేమ్స్‌తో పాటు వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టుకు సారథ్యం వహించే ఆవకాశాలు మెరుగుపడతాయి.
సర్దార్ సింగ్‌కు వచ్చిన ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును విజయపథంలో నడిపిస్తే భవిష్యత్‌లో కెప్టెన్ బర్త్ ఖాయమవుతుందని చెప్పవచ్చు. అజ్లాన్ షా కప్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న భాతర హాకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా స్ట్రైకర్ రామాన్‌దీప్ వ్యవహరిస్తాడు. జట్టుకు ఎంపికైన వారిలో మన్‌దీప్ మోర్, సుమిత్ కుమార్ (జూనియర్), శిలానంద్ లాక్ర ఉన్నారు.