క్రీడాభూమి

వహ్వా..చాహల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 22: లెగ్‌స్పిన్నర్లను ఎదుర్కోవడమంటే తనకెంతో ఆసక్తి అని, ముఖ్యంగా భారత లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తాను ఎంతగానో ఇష్టపడతానని దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో రెండో 20-20లో భారత్‌పై విజయం సాధించడానికి నాలుగు ఓవర్లలో చాహల్ భారీగానే పరుగులిచ్చినప్పటికీ అతని బౌలింగ్ పట్ల క్లాసెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొదటినుంచి కూడా తనకు లెగ్‌స్పిన్నర్లంటే ఎంతో ఇష్టమని, తన కెరీర్ మొదలైనపుడు పేభారత్‌తో బుధవారం జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ రెండో మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికాను గెలిపించి ఘనతను దక్కించుకున్న బిగ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌కు ముగ్ధుడై ధన్యవాదాలు తెలిపాడు. వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఒక వనే్డ మ్యాచ్‌లో వర్షం పడిన సందర్భంలోనూ ఇదే ఆటతీరును కనబరచి హీరోగా ఒక వెలుగు వెలిగిన క్లాసెన్ ఇపుడు తాజా టీ-20 మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేయడం ద్వారా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి జట్టును విజయతీరాలకు చేర్చడంతో ప్రముఖ పాత్ర పోషించాడు.
టీ-20 మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ వేసిన 13 ఓవర్‌లో క్లాసెన్ 23 పరుగులు చేశాడు. భారత టీమ్‌లో మణికట్టు ద్వయంగా ఇటీవల జరిగిన వివిధ మ్యాచ్‌ల సందర్భంగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ తమ ఆటతీరుతో జట్టు యాజమాన్యం నుంచి ప్రశంసలు అందుకున్నారు. గత మ్యాచ్‌లో చాహల్ వేసి న నాలుగు ఓవర్లలో 64 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. దీంతో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఏ భారత బౌలర్ సాధించని చెత్త రికార్డు చాహల్ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా హెన్రిచ్ క్లాసెన్ మాట్లాడుతూ లెగ్ స్పిన్నర్లను ఢీకొనేందుకు
తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో భారత స్పిన్నర్ చాహల్ వంటి వాళ్లను ఎంతో ఇష్టపడతానని అన్నాడు. క్రికెట్‌లో కెరీర్ ప్రారంభించేటపుడు ఏ కొద్దిమందో మంచి నైపుణ్యం కలిగిన లెగ్ స్పిన్నర్లు ఉండేవారని, అలాంటి వారిలో షాన్ వాన్ బెర్గ్, టైటాన్స్ ఉన్నారని క్లాసెన్ అన్నాడు. లెగ్‌స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎలా తిప్పికొట్టాలో తనకు బాగా తెలుసునని పేర్కొన్నాడు. చాహల్ స్పిన్ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలో ముందుగా ఎలాంటి ప్రణాళిక రచించలేదని, అప్పటికప్పుడు ధీటుగా సమాధానం చెప్పడం తనకు నచ్చిన అంశమని అన్నాడు. చాహల్ బౌలింగ్‌లో తొలి ఓవర్‌లో రెండు బౌండరీలో కొట్టానో, మిగిలిన ఓవర్లలోనూ అదే ఆటతీరును ప్రదర్శించాలని అనుకుని అందుకు తగ్గట్టుగానే వ్యవహించి తమ జట్టును విజయతీరాలకు చేర్చడంలో తగిన పాత్ర పోషించానని ఆయన పేర్కొన్నాడు.
భయాన్ని పోగొట్టిన డుమినీ
భారత్‌తో బుధవారం జరిగిన టీ-20 రెండో మ్యాచ్ సందర్భంగా ఎదురయ్యే వత్తిడి అధిగమించేందుకు తమ జట్టు
కెప్టెన్ జేపీ డుమినీ ఇచ్చిన సూచనలు, సలహాలు తనలో భయాన్ని పొగొట్టాయని దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ పేర్కొన్నాడు. మ్యాచ్‌లో కెప్టెన్‌తో కలసి మూడో వికెట్‌కు 49 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం అందించిన క్లాసెన్ తన మొత్తం ఇన్నింగ్స్‌లో సాధించిన ఘనత అంతా డుమినీదేనని వ్యాఖ్యానించాడు.
మొదటి ఓవర్, రెండో ఓవర్‌లో ‘నీ ఆటతీరుకు అనుగుణంగా ఆడు..బౌలర్లను ఎదుర్కో’ అంటూ కెప్టెన్ ఇచ్చిన సలహా తనలో ధైర్యాన్ని నింపిందని, అదే ఈ మ్యాచ్‌ను మలుపుతిప్పి తమ వశమైందని అన్నాడు. భారత బౌలర్లు చాలా బాగా పరిణితి చెందినవారని, కనుక జాగురూకతతో వ్యవహరించాల్సి ఉంటుందని డుమినీ ముందుగానే హెచ్చరికతో కూడిన సూచనలు చేయడంతో తాను అందుకు తగ్గట్టుగానే ఆటతీరును ప్రదర్శించానన్నాడు.
కేవలం టీ-20లోనే కాకుండా భారత్‌తో సెంచూరియన్ మైదానంలో జరిగిన వనే్డలలో కూడా హెన్రిచ్ క్లాసెన్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే.