క్రీడాభూమి

క్యాచ్‌లలో ధోనీ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 25: భారత క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రస్తుత జట్టులోని వికెట్ కీపర్, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. తన క్రీడా జీవితంలో ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించిన ధోని వివిధ టోర్నీలలో క్యాచ్‌లు పట్టడంలో 50 అర్ధ సెంచరీలు చేసి రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇంతవరకు ధోని ఆడిన టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా 49 క్యాచ్‌లు పట్టుకున్నాడు. కేప్‌టౌన్ దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన టీ-20 ఆఖరి మ్యాచ్‌లో మరో క్యాచ్ పట్టుకోవడం ద్వారా అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఘనతను సాధించాడు. వెస్టిండీస్ క్రికెటర్ దినేష్ రమ్‌దిన్ 32 క్యాచ్‌లలో మహేంద్ర సింగ్ ధోని తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డి కాక్ 30 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. క్యాచ్‌లు, స్టంప్ అవుట్‌లలో మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో 78 నమోదు కాగా, పాకిస్తాన్ క్రికెటర్ అక్మల్ 60తో రెండో స్థానంలో నిలిచాడు. 36 ఏళ్ల భారత మాజీ కెప్టెన్ ధోని ఇప్పటివరకు 88 టీ-20 మ్యాచ్‌లు ఆడి 1,432 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.