క్రీడాభూమి

ఏడవ స్థానంలో హైదరాబాద్ అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 25: జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ పోటీల్లోని వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన జిమ్నాస్ట్ అరుణా బుద్ధారెడ్డి ఆదివారం జరిగిన ఫ్లోర్ ఈవెంట్ ఫైనల్ రౌండ్‌లో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ పోటీలో ఆమె 10.833 స్కోరు సాధించింది. అదేవిధంగా పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన రాకేష్ పాత్ర ఫైనల్ రౌండ్‌లో 13.433 స్కోరుతో ఏడవ స్థానంలో నిలిచాడు. అలాగే 2014 ఢిల్లీ కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతక విజేత ఆశిష్ కుమార్ వాల్ట్ ఈవెంట్‌లో 13.583 స్కోరుతో ఎనిమిదో స్థానం దక్కించుకున్నాడు.