క్రీడాభూమి

రికార్డును తిరగరాశాం:మిథాలీ రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 25: దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ ఐదోది, ఆఖరిది అయిన ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ద్వారా రికార్డులను తిరగ రాశామని భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ పేర్కొంది. టీ-20 ఫైనల్‌లో కరేబియన్ గడ్డపై ఆతిధ్య జట్టును 54 పరుగుల తేడాతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా జరిగిన రెండు సిరీస్‌లు (వనే్డ ఇంటర్నేషనల్, టీ-20 ఇంటర్నేషనల్) గెలుచుకున్న అనంతరం మిథాలీ రాజ్ ఇక్కడి మీడియాతో మాట్లాడింది. ఒక టూర్‌లో రెండు సిరీస్‌లు గెలిచిన భారత జట్టుగా రికార్డు పుటల్లోకి ఎక్కిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ తమ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో మంచి స్కోరు సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. ‘టీ-20 ఫార్మాట్లలో ఒక జట్టు రాణించాలంటే మరింత బాగా పనిచేయాల్సి ఉంటుంది’ అని ఆమె అభిప్రాయపడింది. వనే్డ ఇంటర్నేషనల్ టోర్నీలో తమ జట్టు యావత్తూ బాగా ఆడిందని పేర్కొంది. దక్షిణాఫ్రికాతో తాము ఆడిన రెండు సిరీస్‌లను టీవీ మాధ్యమాల్లో తిలకించిన జనం తమ ఆటతీరు ఎలాగుందో తెలుసుకునేందుకు తహతహలాడారని తెలిపింది. వనే్డ, టీ-20 సిరీస్‌లలో ఫలితాలతో ఎంతో ఆనందంగా ఉన్న తాము త్వరలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగే ట్రైసిరీస్‌లోనూ ఇదే రీతిన ఆటతీరును ప్రదర్శిస్తామనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది.
తమ జట్టులోని యువ క్రికెటర్లు సైతం జట్టు గెలుపు బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకుని కృషి చేస్తున్నారని ఆమె కితాబునిచ్చింది.