క్రీడాభూమి

రోహిత్‌కు కెప్టెన్ బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 25: శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మార్చి 6 నుంచి 18 వరకు జరుగనున్న మూడు దేశాల ముక్కోణపు టీ-20 సిరీస్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగే ముక్కోణపు టీ-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సమావేశమైన చీప్ సెలెక్షన్ కమిటీ ఈ మేరకు జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టు ముక్కోణపు సిరీస్‌లో ఆడనుంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దక్షిణాఫ్రికా టూర్‌లో అలసిపోయిన బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యలకు కూడా విశ్రాంతినిచ్చారు. శ్రీలంకలో పాల్గొంటున్న భారత జట్టులో కుల్దీప్ యాదవ్‌కు కూడా అవకాశం ఇవ్వలేదు. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, ఫేస్ వౌలర్ మహ్మద్ సిరాజ్, ఆల్ రౌండర్ దీపక్ హుడా ముక్కోణపు టీ-20 సిరీస్‌లో పాల్గొంటున్నారు. మరో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు పాండ్య స్థానంలో చోటు కల్పించారు. భారత జట్టులో పూర్తిస్థాయి కీపర్‌గా దినేష్ కార్తిక్ కొనసాగిన్నప్పటికీ, బ్యాట్స్‌మన్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఆవకాశం ఇవ్వనున్నారు.
* జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా, మనీశ్ పాండే, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, శార్ధూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్).
అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ
దక్షిణాఫ్రికాతో శనివారం జరగిన చివరి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాప్రికా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసి ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ టూర్‌లో ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న రోహిత్ చివరి మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్‌లో రోహిత్ రాణించకున్నా అతడి ఖాతాలో మాత్రం అరుదైన రికార్డు వచ్చి చేరింది. సారథ్య బాధ్యతలు చేపట్టిన మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకున్న కెప్టెన్ జాబితాలో తాజాగా రోహిత్ పేరు కూడా చేరింది. గతంలో పాకిస్తాన్ ఆటగాళ్లు మిస్బావుల్ హక్, షాహిద్ ఆఫ్రిది, సర్ఫరాజ్ అహ్మద్, శ్రీలంక ఆటగాళ్లు సంగక్కర, లసిత్ మలింగ ఈ ఘనత సాధించారు. గతేడాది డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ-20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ ఆ సిరీస్‌ను 3-0తో భారత్‌కు అందించాడు.