క్రీడాభూమి

భారత్ బౌలింగ్ భేష్ :గిబ్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 25: టీమిండియా బౌలర్ల ఆటతీరుపై కరేబియన్ జట్టు కోచ్ ఒట్టిస్ గిబ్సన్ ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేశాడు. శనివారం జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుపొందిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘్భరత జట్టులో బౌలర్ల ఆటతీరులో ఒక ప్రత్యేక ఉంది’ అని ఆయన అన్నాడు. ఎంతో పరిణితి చెందిన అనుభవంతోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా టీ-20 ఫైనల్‌లో విక్టరీ నమోదు చేసిందని ఆయన అన్నాడు. టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగా, అందుకు ప్రతిగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని ఛేదించలేక 165 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవం కలిగిన బౌలర్లు ఉండడం వారికి బాగా కలిసొచ్చిన అదృష్టమని అన్నాడు. తమ టీమ్‌లోనూ క్రిస్ మోరిస్, జూనియర్ డాలా వంటి పరిణితి చెందిన బౌలర్లు ఉన్నప్పటికీ, భారత్ జట్టు సభ్యులకు ఐపీఎల్ వంటి క్రికెట్ పోటీల్లో మూడు, నాలుగేళ్ల పాటు ఆడిన చరిత్ర ఉందని, దీనిద్వారా వారు బౌలింగ్‌లో మంచి మెలకువలు తెలుసుకుని ప్రత్యర్థిపై ప్రయోగించి సఫలం అవుతున్నారని అన్నాడు. తమ జట్టులోని మోరిస్, జూనియర్ డాలా వంటి వారు ఆటలో మరింత బాగా రాణించాలంటే కొంత సమయం పడుతుందని అన్నాడు. కరేబియన్ టీమ్‌లో ఏబీ డివిలియర్స్, ఫఫ్ డుప్లెసిస్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు గాయాలబారిన పడి జట్టులో ఆడలేకపోవడం కూడా తమకు అనుకూలించలేదని ఆయన అన్నాడు. జట్టులోకి కొత్త ముఖాలైన జూనియర్ డాలా, హెన్రిచ్ క్లాసెన్, క్రిస్టియన్ జోన్‌కర్ వంటివారితోపాటు వనే్డలలో ఆడిన లున్గీ ఎన్‌గిడి వంటివారు సైతం తమ ఆటతీరుతో మెప్పించిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నాడు. సిరీస్‌లు కోల్పోయినంత మాత్రాన బాధ లేదని, కానీ జట్టులో కొందరు సీనియర్లు లేకుండా బరిలో దిగుతుండడం వల్ల అనుకున్న ఫలితాలు కానరావడంలేదని ఆయన వ్యాఖ్యానించాడు. కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని వారితో ప్రయోగాలు చేయించడం వల్ల ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని అన్నాడు.