క్రీడాభూమి

కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, మార్చి 13: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియెల్లీ వాట్ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 2014లో భారత్ పరుగుల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని ట్విట్టర్ ద్వారా పెళ్లి ప్రపోజల్ చేసింది తనే. ఇపుడు ఆమె గురించి ఎందుకంటే.. త్వరలో ముక్కోణపు టీ-29 సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. భారత్‌కు వచ్చే ఇంగ్లాండ్ జట్టులో డేనియెల్లీ సభ్యురాలు. 2014లో టీ-20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ ప్రదర్శన చూసిన డేనియెల్లీ పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. దీంతో ట్విట్టర్ వేదికగా ‘కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో’ అని ప్రపోజల్ కూడా చేసేసింది. అదే ఏడాది టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అపుడు డెర్బిషైర్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌కు వచ్చింది. డేనియెల్లీ మ్యాచ్ అనంతరం కోహ్లీని కలిసింది. ఫొటో కూడా దిగింది.
ఈ సందర్భంగా కోహ్లీ తన దగ్గర ఉన్న ఒక బ్యాట్‌ను కానుకగా ఆమెకు బహూకరించాడు. కోహ్లీతో దిగిన ఫొటోలను, బ్యాట్‌ను కూడా డేనియెల్లీ అప్పట్లో ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ముక్కోణపు సిరీస్ కోసం భారత్ రానున్న డేనియెల్లీ తాజాగా మీడియాతో మాట్లాడింది. ‘్భరత పర్యటనలో నేను కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతాను. ఎందుకంటే నేను వాడే బ్యాట్ విరిగిపోయింది’ అని తెలిపింది. భారత్, ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియాల మధ్య ముక్కోణపు టీ-20 సిరీస్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనుంది. ఆ తర్వాత ఈనెల 25న భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది.