క్రీడాభూమి

చాలా పెద్ద తప్పు చేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 13: రెండు టెస్టులు నిషేధం విధించడంపై దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 11 వికెట్ల తేడాతో ఈ సూపర్ బౌలర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రబడ తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోలేక తనతోపాటు జట్టును కూడా తీవ్రంగా నష్టపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ పేసర్ రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను బౌల్డ్ చేసి తీవ్రంగా అరిచాడు. ఈ ప్రవర్తనతో రబడ తర్వాతి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐసీసీ విధించిన నిషేధంపై రబడ స్పందిస్తూ ‘నేను ఇలా చేయాల్సింది కాదు. ఈ ప్రవర్తనతో మనిషిగా, వ్యక్తిగా ఎంతగానో దిగిజారిపోయా. ఈ ఘటనతో నేనెంతో నేర్చుకున్నా.. తిరిగి ఇలాంటి తప్పిదాలను భవిష్యత్తులో పునారవృతం కానివ్వను. ఈ ఘటనలకు చాలా కారణాలున్నాయి. కానీ రూల్స్ రూల్సే. స్మిత్‌ను ఉద్దేశ్యపూర్వకంగా తాకలేదు. లార్డ్స్ మైదానంలో నేను చేసింది తప్పని తెలిసే అపుడు అప్పీల్ చేయలేదు. నిజాయితీగా చేప్పాలంటే అసలు నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. ఓ పెద్ద సిరీస్ నుంచి దూరమయ్యాను. నేను చాలా ఆడాల్సి ఉంది. కీలక సమయంలో జట్టుకు దూరమయ్యాను’ అని రబడ ఆవేదన వ్యక్తం చేశాడు. జనవరి 2017 నుంచి వేర్వేరు ఘటనల్లో (డిక్‌వెలా, స్టోక్స్, ధావన్‌లతో గొడవ) ఇప్పటికే ఐదు డీమెరిట్ పాయింట్లు ఈ పేసర్ ఖాతాలో ఉన్నాయి. దాంతో పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరి రెండు టెస్టుల నిషేధం పడింది. వార్నర్ ఘటనలో కూడా 15 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు 1 డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ శిక్షగా విధించింది. దాంతో రబడ మొత్తం పాయింట్ల సంఖ్య 9కి చేరింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. సరైన సమయంలో రబడ దూరం కావడం దక్షిణాఫ్రికా జట్టుకు నష్టం చేకూరనుంది.