క్రీడాభూమి

నేటినుండి ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, మార్చి 13: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్. ఇంతవరకు మన దేశంలో అగ్రశ్రేణి బాడ్మింటన్ క్రీడాకారులుగా చెలామణి అయిన ప్రకాశ్ పదుకొనే (1980), పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే ఈ ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్న ఘనతను సాధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యంత పురాతన టోర్నమెంట్ అయిన ఆల్ ఇంగ్లాండ్ మళ్లీ వచ్చేసింది. బుధవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారతదేశం తరఫున ఆడుతున్న పలువురు క్రీడాకారులు టైటిల్‌ను సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలవాలని ఎంతోమంది కలలుగంటుంటారు. గతంలో జరిగిన ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, సూపర్ సిరీస్‌లలో సత్తా చూపిన హైదరాబాదీలు సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటివారు ఆల్ ఇంగ్లాండ్‌లో పోరాడి ఓడారు. సైనా నెహ్వాల్ అందరికంటే ఎక్కువగా 10 సార్లు ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో ఆడినా 2015లో రన్నరప్‌గా నిలిచింది. ఒలింపిక్‌లో కాంస్య పతక విజేత పీవీ సింధు ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో ఐదుసార్లు ఆడినా కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేదు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్‌లో భారత క్రీడాకారులు మరింత మెరుగ్గా ఉండడంతో భారత్ ఆశించిన ఫలితాలు రావచ్చుని క్రీడాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పురుషుల్లో శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్ వంటి, సుమీత్, ప్రణవ్, మహిళల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి, మను అత్రి ఆల్‌ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ పోటీలో తలపడనున్నారు. సింధు, శ్రీకాంత్‌లకు తొలిరౌండ్‌లో సులువైన డ్రా పడింది. అయితే, సైనా నెహ్వాల్‌కు తొలిరౌండ్‌లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆమె ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్‌తో తలపడనుంది. ఆమె ఇప్పటివరకు తన ప్రత్యర్థిని అనేకసార్లు ఓడించింది. ఇక నాలుగో సీడ్ క్రీడాకారిణి పీవీ సింధు ఓపెనింగ్ మ్యాచ్‌లో థాయ్ క్రీడాకారిణి పోర్న్‌పావీ చోచువాంగ్‌తో తలపడుతుంది. శ్రీకాంత్ తొలి రౌండ్‌లో ఫ్రెంచ్‌కి చెందిన బ్రైస్ లివర్‌డెజ్‌తో పోటీపడతాడు. 2015లో జరగిన లండన్ ఒలింపిక్స్ ఫైనల్‌లో కారొలినా మారిన్‌తో పోటీపడిన భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కాంస్య పతకం దక్కించుకుంది. ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్‌తో జరిగే తొలిరౌండ్ గురించి సైనా నెహ్వాల్ మాట్లాడుతూ ‘తై జు ప్రపంచ నెంబర్ వన్ క్రీడారాణే..కాదనలేం...ఆటపై కొన్ని టెక్నిక్‌లతో ఆమె తమపై పట్టు సాధ్యమైంది..కానీ ఇపుడు ఆమెను తాము తప్పకుండా ఢీకొంటాం..దానికి టైమ్ రావాలి’ అని ఇటీవల వ్యాఖ్యానించింది. పీవీ సింధు మాట్లాడుతూ ఇండియన్ ఓపెన్ తనను ఓడించిన బెవెన్ జాంగ్‌ను ఒడించి, గత రికార్డును తిరగరాస్తానని పేర్కొంది. దాదాపు ఆరువారాలపాటు తాము కఠిన శిక్షణ పొందామని, ఇది ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో బాగా ఆడేందుకు ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఈ ఏడాది చాలా టోర్నమెంట్లు ఆడాల్సి ఉందని, అన్నింటిలోనూ తనదైన ముద్రతో బాగా రాణించాలని కోరుకుంటున్నానని పేర్కొంది రియో ఒలింపిక్స్ సిల్వర్ పతక విజేత సింధు. ఆల్ ఇంగ్లాండ్‌లో బాగా రాణించేందుకు తమకు సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ తమకు స్ఫూర్తిగా నిలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తామని శ్రీకాంత్ పేర్కొన్నాడు. గత ఏడాది శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించాడు. అయితే, గత అక్టోబర్ నుండి గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. గడచిన ఆరు నెలల్లో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఆల్‌ఇంగ్లాండ్‌లో మంచి ఫలితం కోసం కృషి చేస్తానని అంటున్నాడు. సింగపూర్ ఓపెన్ చాంపియన్ సాయి ప్రణీత్, ప్రపంచ నెంబర్ 12 క్రీడాకారుడు హెచ్.ఎస్.ప్రణయ్, అశ్విని పొన్నప్ప, ఎన్.సిక్కిరెడ్డి శక్తివంచన లేకుండా పోరాడతామని ధీమా వ్యక్తం చేశారు.