క్రీడాభూమి

బంగ్లాదేశ్‌తో భారత్ అమీ తుమీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 13: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల నిదహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీ ఐదో మ్యాచ్‌లో బుధవారం టీమిండియా, బంగ్లాదేశ్ జట్టు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు రెండు మ్యాచ్‌లలో గెలుపొందడం ద్వారా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన దారులన్నీ మూసుకుపోలేదన్న గట్టి నమ్మకంతో ఉన్న టీమిండియా ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంకతో తర్వాతి మ్యాచ్‌లలో మట్టికరిపించింది. ఇదే ధీమాతో బుధవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చెక్ పెట్టేందుకు భారత్ సర్వసన్నద్ధమవుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌లలో విజయగర్వంతో పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఇక రన్ రేట్ పరంగా చూసుకున్నా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించడంతో భారత్ రన్‌రేట్ +0.21 ఉంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టులో పలువురు క్రికెటర్లకు విశ్రాంతినిచ్చి యువకులకు చక్కని అవకాశం కల్పించింది. అయినా, జట్టులో దీపక్ హుడా, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ వంటివారు తమ ప్రతిభకు నిరూపించుకునేందుకు ఇంతవరకు ఈ టోర్నమెంట్‌లో ఎలాంటి అవకాశం దక్కలేదు. 15 మంది సభ్యులు గల టీమిండియా జట్టులో దీపక్ హుడాకు స్వదేశంలో శ్రీలంకతో జరిగన సిరీస్‌లో ఆడేందుకు చాన్స్ రాలేదు. ఇక భారత జట్టులో అందరికంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపైనే సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎన్నో విజయవంతమైన మ్యాచ్‌లలో తనదైన ముద్రతో కనిపించిన రోహిత్ తన మునుపటి క్రీడాపటిమను బంగ్లాదేశ్‌తో జరిగే ఈ పోరాటంలో కనబరుస్తాడనే విశ్వాసాన్ని పలువురు క్రీడాభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో జట్టులో శిఖర్ ధావన్ తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తూ జట్టును చాలా చక్కగా ఆదుకుంటున్నా, కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమవడం నిరాశ కలిగిస్తోంది. సురేష్ రైనా కూడా ఆశించినంత స్కోరు సాధించకపోయినా మిడిలార్డర్‌లో మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ వంటివారు నిలదొక్కుకుంటున్నారు. రానున్న ఐపీఎల్‌లో అత్యధిక పారితోషికం (11.5 కోట్ల రూపాయలు)తో ఎంపికైన జయదేవ్ ఉనద్కత్ ఆడిన మూడు గేమ్‌లలో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 38 పరుగులిచ్చి మూడు వికెట్టు చేజిక్కించుకున్నాడు. సోమవారం మళ్లీ ఆతిధ్య జట్టుతో ఆడిన సందర్భంగా మూడు ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సౌరాష్ట్ర పేసర్ ఉనద్కత్‌తో పోల్చుకుంటే సిరాజ్ తన ఆటతీరుతో ఆకట్టుకోవడంతో అతనికి ఫైనల్‌లో అవకాశం దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అదేవిధంగా శ్రాద్ధూల్ ఠాకూర్, విజయ్ శంకర్, ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండు మ్యాచ్‌లలో బాగా రాణించడంతో బుధవారం జరిగే పోరును చాలెంజ్‌గా తీసుకుంటున్న భారత్ ప్రత్యర్థి జట్టు బంగ్లాదేశ్‌ను ఢీకొనేందుకు బౌలర్లపై గట్టి నమ్మకంతో పెట్టుకుంది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ బ్యాట్‌మెన్‌లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో కేవలం 139 పరుగులకే ఆ టీమ్‌ను కట్టడి చేసి విజయావకాశాలను అందుకున్నారు. బంగ్లాదేశ్ జట్టులో తమీమ్ ఇక్బాల్, లిటోన్ దాస్, ముస్త్ఫాకర్ రహీం వంటివారు తమ తదుపరి పోరులో శ్రీలంక విధించిన భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించి తొలి గెలుపును అందుకున్నారు. అందువల్ల ఆ టీమ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయనక్కర్లేదు. మరోపక్క టీమిండియాతో బుధవారం జరిగే ఐదో మ్యాచ్ బంగ్లాదేశ్‌కు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వాలని యోచిస్తోంది. కెప్టెన్ మహ్మదుల్లా నాయకత్వంలోని బంగ్లాదేశ్ టీమ్ కఠిన పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. స్వదేశీ గడ్డపై శ్రీలంక తమ ఎదుట ఉంచిన భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించి ఘన విజయం సాధించడంతో ‘క్రికెట్‌లో తమ బ్రాండ్’ అంటే ఏమిటో నిరూపిస్తామని కెప్టెన్ మహ్మదుల్లా పేర్కొన్నాడు. టీ-20 ప్రపంచ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఇపుడు భారత్‌తో జరిగే ముక్కోణపు టోర్నీలో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. బంగ్లాదేశ్ జట్టులో గాయపడిన కెప్టెన్ షకీబ్ అలీ హసన్ స్థానంలో కెప్టెన్సీ విధులు చేపట్టిన మహ్మదుల్లా మీడియాతో మాట్లాడుతూ ‘మా జట్టులో నైపుణ్యతకు కొదవలేదు..ముందున్న రిస్క్‌ను అంచనా వేస్తూ ముందుకు సాగుతాం’ అని వ్యాఖ్యానించాడు. తమ జట్టులోని బౌలర్లంతా భారత బ్యాట్స్‌మెన్‌లను త్వరితగతిన కట్టడి చేయాలని ఆయన సూచించాడు. ఈ సందర్భంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టులోని ఎడమచేతివాటం పేసర్ ముస్త్ఫాజర్ రహ్మాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా బౌలర్లు తమ నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన అభ్యర్థించాడు.
చిత్రాలు..భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ *బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ మహ్మదుల్లా