క్రీడాభూమి

షమీపై ఆరోపణలపై విచారణకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14 : హసిన్ జహాన్ చేసిన ఆరోపణలు, తదనంతర పరిణామాలు క్రికెటర్ షమీ కెరీర్‌ను ప్రశార్థకం చేసే దిశగా కొనసాగుతున్నాయి. తాజాగా షమీ భార్య చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్, బీసీసీఐకి చెందిన ఏసీయు నీరజ్ కుమార్‌ను ఆదేశించడం షమీ కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసింది. దీనికి తోడు జహాన్ తన భర్తపై దాంపత్యద్రోహం, గృహ హింస కేసులను పెట్టింది. షమీపై ఇప్పటికే పలు ఆరోపణల నేపథ్యంలోబీసీసీఐ సెంట్రల్ కాంటాక్టును తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా షమీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వారంలోగా నివేదిక సమర్పించాలని, సీఓఏ అధినేత, కుమార్‌ను ఆదేశించారు. అయితే ఆయన రాసిన లేఖలో ఎక్కడా ‘‘మ్యాచ్ ఫిక్సింగ్’’ అనే పదాన్ని ఉపయోగించకపోవడం గమనార్హం. ఇదిలావుండగా షమీ అతని భార్య హసిన్ జహాన్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల రికార్డింగ్‌ను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆలకించారు.
కాగా బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ భాయ్ నిర్దేశం మేరకు, షమీ పాకిస్తాన్ మహిళ అలీష్‌బా నుంచి నగదును తీసుకున్నాడని జహాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక నిబంధనల కింద విచారణ జరపాలని రాయ్ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా మూడు అంశాలపై విచారణ జరపాలని ఆయన కోరారు. 1. మహమ్మద్ భాయ్, అలీష్‌బాలు ఎవరో తెలుసుకోవాలి. 2. మహమ్మద్ భాయ్, అలీష్‌బా ద్వారా మహమ్మద్ షమీకి పైకాన్ని పంపింది వాస్తవమేనా? 3. ఒకవేళ నిజమైతే ఎందుకోసం ఈ పైకాన్ని షమీకి పంపారు? విచారణ కేవలం అవినీతి ఆరోపణలకు మాత్రమే పరిమితం కావాలని రాయ్ స్పష్టం చేశారు.