క్రీడాభూమి

కామనె్వల్త్ గేమ్స్‌లో భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్‌గా రాణీ రాంపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: గోల్డ్‌కోస్ట్‌లో వచ్చేనెలలో జరుగబోయే కామనె్వల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టుకు స్ట్రయికర్ రాణీ రాంపాల్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. అదేవిధంగా వైస్‌కెప్టెన్‌గా మంచి అనుభవం కలిగిన గోల్‌కీపర్ సవిత వ్యవహరించనుంది. భారత టీమ్ పూల్-ఏలో మలేషియా, వేల్స్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాతో ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జరిగే పలు ఈవెంట్లలో ఆడుతుంది. దక్షిణకొరియా టూర్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న గోల్‌కీపర్ సవిత పునరాగమనంతో భారత్‌కు మంచిరోజులు రానున్నాయి. దీపిక, సునీతా లక్రా, దీపా గ్రేస్ ఎక్కా, గుజ్రిత్ కౌర్, సుశీల చాను పుక్రంభం వంటి పరిణితి చెందిన క్రీడాకారిణులు ప్రత్యర్థిని కట్టడి చేసే శక్తిసామర్ధ్యాలు కలిగివున్నారు. అదేవిధంగా మోనిక, నమిత టోప్పో, నిక్కి ప్రధాన్, నేహా గోయల్, లిలిమా మింజ్, రాణి, వందనా కత్రియా, లాల్‌రెమ్సియామి, నవజ్యోత్ కౌర్, నవనీత్ కౌర్, పూనమ్ రాణి వంటి వారు కూడా జట్టులో భాగస్వాములు కానున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న టీమిండియా రెండో ర్యాంకర్ ఇంగ్లాండ్, నాలుగో ర్యాంకర్ న్యూజిలాండ్, ఐదో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో గట్టి పోటీని ఎదుర్కోనుంది. భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ 2017 ఆసియా కప్‌లో దక్షిణ కొరియాపై విజయంలో తమ జట్టు సభ్యులంతా సమష్టిగా రాణించారని, అదేస్ఫూర్తితో వచ్చేనెలలో జరుగబోయే కామనె్వల్త్ గేమ్స్‌లో కూడా బాగా ఆడి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తామనే నమ్మకం, విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలావుండగా, భారత జట్టులోకి వైస్‌కెప్టెన్‌గా రానున్న గోల్ కీపర్ సవిత 200కు పైగా మ్యాచ్‌లలో ఆడిన అనుభవం ఉన్నందున, క్లిష్టపరిస్థితుల్లో సైతం ఆమె జట్టును ఎన్నోసార్లు ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. భారత మహిళల హాకీ జట్టు 2002లో ఇంగ్లాండ్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో 3-2 తేడాతో ఆతిధ్య జట్టును ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
అదేవిధంగా 2016లో ఆస్ట్రేలియా కామనె్వల్త్ గేమ్స్‌లో సిల్వర్ పతకంతో సరిపెట్టుకుంది. కాగా, 2002, 2006 కామనె్వల్త్ గేమ్స్‌లో భారత మహిళా హాకీ జట్టు విజయపరంపరను వచ్చేనెలలో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో కూడా కొనసాగిస్తామని నూతన కెప్టెన్ 23 ఏళ్ల రాణీ రాంపాల్ ధీమా వ్యక్తం చేసింది. తమ జట్టులో ఎంతోమంది అనుభవం కలిగిన యువ క్రీడాకారిణులు ఉన్నారని, వీరంతా మరోసారి గెలుపుకోసం ఎంతో ఉత్సుకతను కనబరుస్తున్నారని ఆమె పేర్కొంది.