క్రీడాభూమి

భారత్‌కు చావోరేవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, మార్చి 14: ఐసీసీ మహిళల వనే్డ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ క్రికెట్ మూడు మ్యాచ్‌లలో ఇప్పటికే ఒకదాన్లో గెలవడం ద్వారా రెండో మ్యాచ్‌పై ఆస్ట్రేలియా జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే, భారత మహిళా జట్టుకు మాత్రం గురువారం ఇక్కడి రిలయన్స్ స్టేడియంలో జరుగనున్న రెండో మ్యాచ్ గట్టి పరీక్ష కానుంది. సోమవారం జరిగిన తొలి పోరులో ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమిపాలైన టీమిండియా తప్పనిసరిగా రెండో మ్యాచ్‌లో గెలుపు సాధించాల్సి ఉంది. అయితే, మొదటి మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 200 పరుగులు చేసినా ప్రత్యర్థి జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 32.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పైచేయి సాధించింది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన నికోల్ ఎలిజబెత్ బోల్టన్ 101 బంతులు ఎదుర్కొని 12 బౌండరీలతో నాటౌట్‌గా నిలిచి భారత బౌలర్లను బెంబేలెత్తించింది. టీమిండియాలో యువ సంచలనం పూజా వస్త్రాకర్ తొమ్మిదో బ్యాట్స్‌మన్‌గా రంగంలోకి దిగి రికార్డు సృష్టించింది. ఈమె ఒక సిక్సర్, ఏడు బౌండరీలతో 51 పరుగులు చేసింది.
ఇదిలావుండగా, ‘బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్‌పైనే భారం వేయడం సరికాదు. సీనియర్ బ్యాట్స్‌మన్లు ముందుకు వచ్చి జట్టును ఆదుకోవాలి’ అని మొదటిరోజు భారత సీనియర్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. తమ జట్టు ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌లో బాగా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడింది. టీమ్‌లో ఓపెనర్లుగా దిగిన స్మృతి మంధాన, పూనమ్ రౌత్ ఇన్నింగ్స్‌ను బాగానే ప్రారంభిస్తున్నారని ఆమె పేర్కొంది. 17 ఏళ్ల యువ క్రికెటర్ జమీమా రోడ్రిగ్స్ తొలి వనే్డ మ్యాచ్‌లో సరిగా రాణించలేదని, ఇపుడు రెండో మ్యాచ్‌కు కెప్టెన్‌గా మిథాలీ రాజ్ వ్యవహరించనున్నందున జమీమా తన బ్యాట్‌కు పదును చెప్పగలదనే నమ్మకం ఉందని హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ప్రత్యర్థి తమ ముంగిట ఎంతటి లక్ష్యం విధించినా అందుకు ధీటుగా భారత బ్యాట్స్‌మన్లు పోరాడాలని పేర్కొంది. అదేవిధంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌లను తక్కువ స్కోరుకే కట్టడి చేసేందుకు బౌలర్లు విజృంభించాల్సిన అవసరం ఉందిన ఆమె తెలిపింది. తొలి వనే్డలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ నికోల్ ఎలిజబెత్ బోల్టన్ 101 బంతులు ఎదుర్కొని సెంచరీ నమోదు చేసిందంటే తమ బౌలర్ల వైఫల్యం చెప్పనే చెబుతుందని ఆమె తెలిపింది.
గురువారం జరిగే రెండో వనే్డలో ప్రత్యర్థి క్రికెటర్ నికోల్ ఎలిజబెత్ బోల్టన్ తన పార్ట్‌నర్ అలైస్సా హీలేతో కలసి మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదని, కనుక టీమిండియా క్రికెటర్లు గట్టి పట్టుదల, కృషితో ఆడితే ప్రత్యర్థిని ఓడించేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె పేర్కొంది. తొలి వనే్డ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని, ఈసారి ఆమె తమ జట్టుకు కెప్టెన్సీగా బాధ్యతలు తీసుకుంటుండడంతో మంచి ఫలితం రాబడతామని ఆమె తెలిపింది. ఇదిలావుండగా, మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో భారత్ చేతిలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా ఐసీసీ మహిళల వనే్డ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఘన విజయం సాధించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది. ఇందుకు తమ జట్టులో నికోల్ బోల్డన్ వంటి క్రికెటర్లు బాగా రాణిస్తే గెలుపు సునాయాసం అవుతుందని ఆసిస్ కెప్టెన్ లాన్నింగ్ పేర్కొంది.
భారత జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, వేదా కృష్ణమూర్తి, పూనమ్ రౌత్, జెమీమా రోడ్రిగ్స్, సుష్మా వర్మ, ఏక్తా బిస్త్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, మోనా మెస్రమ్, పూనమ్ యాదవ్, సుకన్యా పరీదా.
ఆస్ట్రేలియా జట్టు: మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), అలైస్సా హీలే, నికోలస్ బోల్టన్, నికోలా కారే, ఎలైస్ పెర్రీ, ఎలైస్ వెలానీ, ఆష్‌లైగ్ గార్డెనర్, రాచెల్ హేన్స్, జెస్ జొనాస్సెన్, సోఫీ మొలినెక్స్, మెగాన్ స్కట్, బెహ్ మూనే, బెలిండా వకారెవా, అమందా జడే వెల్లింగ్టన్.

చిత్రాలు..భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ *ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మెగ్ లాన్నింగ్