క్రీడాభూమి

రంగంలోకి బీసీసీఐ, అవినీతి నిరోధక అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 19: టీమిండియా పేసర్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోణలు చేసి పెను కలవరం రేపింది అతని భార్య హసిన్ జహాన్. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ అదేశాలానుసారం రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు హసీన్‌ను విచారణలో భాగంగా వివిధ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తాజాగా టీమిండియా క్రికెటర్ మస్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న నలుగురు అధికారులు సుదీర్ఘంగా ఆమెను ప్రశ్నించారు. అమె చేసిన ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. హసీన్ జహాన్ చేసిన ఆరోపణలు.. ఆమె ఆ విషయాలు ఎలా తెలుసన్న కోణంలోనే మూడు గంటలకు పైగా జరిగిన విచారణలో అధికారులు ప్రశ్నలు గుప్పించారు. వాటిలో చాలావరకు ఆమె తడబడటం, వౌనంగా ఉండటంతో పాటు పొంతన లేని సమాధానాలు చెప్పడం వంటి వాటిని అధికారులు రికార్డు చేశారు. దీంతో అమెను మరోసారి ప్రశ్నించే యోచనలో అవినీతి నిరోధక విభాగం అధికారులున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన అలిషబా అనే యువతి నుంచి డబ్బులు తీసుకుని షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, దీని వెనుక ఇంగ్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త మహ్మద్ భాయ్ ఉన్నాడంటూ జహాన్ ఆరోపించింది. ఇదిలాఉండగా ఆదివారం అవినీతి నిరోధక శాఖ అదికారుల బృందం ఆదివారం అమ్రోహలోని పేసర్ షమీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం క్రికెటర్ ఇంటికి చేరుకున్న అవినీతి శాఖ అధికారులు షమీని, అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.
షమీ ప్రవర్తన, అతడు ఎలా ఉండేవాడు, అతడికి సంబంధించిన వ్యక్తిగత అంశాలపై కుటుంబసభ్యులను అధికారులు ప్రశ్నించారు. షమీకి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనపై వేధింపులకు పాల్పడ్డాడని అతని భార్య హసీన్ జహాన్ ఆరోపించారు. దాంతో పాటుగా పాకిస్తాన్ మహిళతో నగదు తీసుకుని క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేశాడంటూ కీలకమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆడియో టేపులను అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. ‘హసీన్ నా మాజీ భార్య అంటూ. అమెతతో తనకు ఇద్దరు పిల్లలు పుట్టారు’ అంటూ ఓ వ్యక్తి బయటకు రావడంతో షమీ భార్య కాస్త తగ్గినట్లు కనిపించింది. షమీ భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ అదేశానుసారం బీసీసీఐ అనినీతి నిరోధక విభాగం అధికారులు విచారణ చేపట్టారు. వారం రోజుల్లోగా దీనిపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని గడువు ఇచ్చారు. అధికారుల నివేదిక మీద షమీ క్రికెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరోవైపు హసీన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనకు మరణశిక్ష విధించి, ఉరి తీయాలని షమీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. షమీ-హసీన్ జహాన్‌ల మధ్య కొనసాగుతున్న కేసు హాట్ టాపిగ్‌గా మారింది.
సీఎం మమతను కలవాలి
ఇండియన్ పేసర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తనకు సమయం ఇవ్వాల్సిందిగా కోరింది. తన భర్త షమీపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన తన బాధను విని అర్థం చేసుకోవాల్సిందిగా అభ్యర్థించింది. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈరోజు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా.. నిజాన్ని నిగ్గు తేల్చేందుకే నేను పోరాడుతున్నా.. నేను చిత్రహింసలు అనుభవించా.. నేను మీ మద్దతు కోరడం లేదు. కానీ, నా పోరాటంపై మీరు దృష్టి సారిస్తే అదే చాలు. మిమ్ములను కలిసిన తర్వాత నేను చెప్పేది వినండి. నేను చెప్పిన తర్వాత ఏం చేయాలో మీరే నిర్ణయించండి’ అని మీడియా ఎదుట పేర్కొంది. ‘మిమ్మల్ని కలిసి నా బాధను పంచుకోవాలని భావిస్తున్నా. అందుకే ఈ అభ్యర్థన’ అని హసీన్ పేర్కొంది.
నా కెరీర్‌ను దెబ్బతీసేందుకే ఈ కుట్ర : షమీ
ఢిల్లీ: తన కెరీర్‌ను దెబ్బతీసేందుకే తన భార్య హసిన్ జహాన్ ఆరోపణలు చేస్తోందని భారత క్రికెట్ జట్టు బౌలర్ మహ్మద్ షమీ అన్నారు. ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. ‘ఈ కేసు విచారణ చేసేందుకు పోలీసులకు నేను, నా కుటుంబసభ్యులు పూర్తిగా సహకరిస్తున్నాం. నా భార్య నామీద చేసిన ఆరోపణల్లో సగం కూడా నిరూపించలేకపోయింది. ఇంకా ఆమె ఏం చేస్తుందో నేను చూస్తాను. ఈ వివాదాన్ని 7, 8 రోజుల్లో పరిష్కరించాలని ప్రయత్నించాను. కానీ తను బహిర్గతం చేసింది. ఇక నాకు ఎటువంటి అవకాశం లేకుండా చేసింది. అందుకే దీనిని న్యాయబద్ధంగా పరిష్కరించాలని అనుకుంటున్నాను. నా క్రికెట్‌కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నా కెరీర్‌ను దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర ఇది. బీసీసీఐని నేను ఒకటే కోరుకుంటున్నాను. వీలైనంత త్వరగా ఈ కేసు విచారణ ప్రారంభించాలని అభ్యర్థిస్తున్నాను. నేను అమాయకుడిని అని నిరూపమైతే.. నేను నా ప్రాక్టీస్‌ను మళ్లీ ప్రారంభిస్తా’ అని ఆయన పేర్కొన్నాడు.