క్రీడాభూమి

చివరి బాల్ సిక్స్ చూశారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 19: చివరి బంతికి సిక్స్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. 2011 ప్రపంచకప్ విజయాన్నందించిన ధోనీ సిక్సర్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాటే. తాజాగా అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు మరో భారత యువ అటగాడు దినేశ్ కార్తీక్. నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసినవాళ్లు పొందిన అనుభూతే వేరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరిచిపోలేడు. భారత్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో చేయాల్సింది 34 పరుగులు. ఇక భారత్ గెలవడం కష్టమే అని భావించిన ఎంతో మంది అభిమానులు తమ టీవీలు ఆఫ్ చేసి పడుకునే ఉంటారు. మధ్య రాత్రిలో ఫోన్ చూసుకున్న వారు, సోమవారం తెల్లవారుజామున దినపత్రికలు చూసిన వారు ఆరె రాత్రి మ్యాచ్ చూడలేకపోయామే అని అనుకోకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో!. చివరకు అభిమానుల మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించాడు. ఒక్కసారిగా హీరో అయిన కార్తీక్ గురించే ఇపుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి కొట్టిన సిక్స్ చూశాకా వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.