క్రీడాభూమి

హోంవర్క్ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఎంతో కసరత్తు చేయాల్సిన టోర్నీ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారనడానికి ఇదో ఉదాహరణ. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకావడానికి ఒక రోజు ముందు ఈ టోర్నీ ప్రారంభ వేడుకలు జరిగేవి. కానీ, ఈసారి ఏప్రిల్ 7న ఐపీఎల్ తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుండగా, ఆ మ్యాచ్ మొదలయ్యేందుకు కొద్ది సేపటి ముందే ప్రారంభోత్సవ వేడుకను జరపాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఎనిమిది జట్ల కెప్టెన్లతో ప్రత్యేకంగా ఒక షూటౌట్‌కు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, ఈ వేడుకల్లో పాల్గొని, ఆ వెంటనే బయలుదేరి తాము మ్యాచ్‌లు ఆడాల్సిన నగరాలకు చేరుకోవడం మిగతా ఆరు జట్ల కెప్టెన్లకు ఎంత వరకు సాధ్యమనే విషయాన్ని వారు ఆలోచించలేదు. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి మ్యాచ్ ఆడేందుకు ముంబయిలోనే ఉంటారు కాబట్టి, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, మిగతా ఆరుగురు కెప్టెన్లు సమస్యలు ఎదుర్కోక తప్పదు. మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 8న రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను మొహాలీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఢీ కొంటుంది. రాత్రి 8 గంటలకు కోల్‌కతాలో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రాయల్ చారెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఈ నలుగురు కెప్టెన్లు ఏడో తేదీన ప్రారంభోత్సవానికి హాజరై, ఆ వెంటనే మొహాలీ లేదా కోల్‌కతాకు వెళ్లి మ్యాచ్‌కి సిద్ధం కావడం అసాధ్యమని, ఈ విషయంపై ఐపీఎల్ అధికారులు ఎందుకు హోం వర్క్ చేయలేదో అర్థం కావడం లేదని అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. ముందు చూపులేకుండా షెడ్యూల్‌ను ఎలా ఖరారు చేశారని నిలదీస్తున్నారు. అయితే, ఈ సమస్యను ముందుగానే గుర్తించామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నాడు. ప్రారంభోత్సవానికి హాజరుకాలేని కెప్టెన్లను ఒక రోజు ముందుగానే పిలిపించి, ఐపీఎల్ షూట్‌ను పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవం నాడు ఆ క్లిప్పింగ్స్‌ను ప్రదర్శిస్తిమని వివరించాడు. ఏది ఏమైనా, మ్యాచ్‌లు మొదలయ్యే రోజునే ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఐపీఎల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం విమర్శలకు గురవుతున్నది.

ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే డిసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్‌ఎస్)ను అమలు చేస్తున్నట్టు టోర్నీ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించాడు. ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ డీఆర్‌ఎస్‌ను బీసీసీఐ అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన సిరీస్‌ల్లో డీఆర్‌ఎస్‌ను అమలు చేశారని, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఈ విధానం ఉంటుందని వివరించాడు.