క్రీడాభూమి

త్రిశంకు స్వర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: కామనె్వల్త్ గేమ్స్‌లో పోటీపడేందుకు సిద్ధమైన భారత బాస్కెట్‌బాల్ బృందం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నది. 2006లో మొదటిసారి కామనె్వల్త్ గేమ్స్‌లో అరంగేట్రం చేసిన బాస్కెట్‌బాల్‌కు ఆతర్వాత చోటు దక్కలేదు. సుమారు 12 సంవత్సరాల తర్వాత ఈసారి మళ్లీ ఈ విభాగానికి కామనె్వల్త్‌లో అభిమానులను ఆకట్టుకునే అవకాశం దక్కింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్న భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో జట్లను పోటీకి దింపింది. అయితే, పురుషుల విభాగంలో నలుగురు, మహిళల విభాగంలో ఒకరు చొప్పున ఆటగాళ్లకు, సీనియర్ కోచ్‌లకు, జట్ల అధికారులకు వీసాలు లభించకపోవడంతో ఏం చేయాలో అర్థంగాక మల్లగుల్లాలు పడుతున్నది. 24 మందితో కూడిన భారత బాస్కెట్‌బాల్ బృందంలో 19 మంది ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. మిగతా ఐదుగురికి వీసాలు లభించలేదు. అంతేగాక, పురుషుల విభాగం హెడ్ కోచ్ రాజీందర్ సింగ్, మహిళల కోచ్ షీబా మగాన్ తదితరులకు కూడా వీసా మంజూరు కాకపోవడంతో, ఆస్ట్రేలియా వెళ్లిన బృందం వారి కోసం ఎదురుచూస్తున్నది. కోచ్‌లు లేకపోవడంతో అత్యంత కీలకమైన ప్రాక్టీస్‌ను కూడా వారు కోల్పోతున్నారు. అంతేగాక, అధికారులు అందుబాటులో లేనందున, దినవారీ అంశాలను సరి చూసుకోవడంలోనే వారి సమయం గడిచిపోతున్నది. వీసు కోసం ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నామని, త్వరలోనే అవస్తాయని ఆశిస్తున్నామని బీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి చందర్ ముఖి శర్మ వ్యాఖ్యానించాడు.