క్రీడాభూమి

స్కాట్‌లాండ్‌పై విండీస్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, మార్చి 21: ప్రపంచ కప్ క్రికెట్ క్వాలిఫయంగ్ ఈ వెంట్, సూపర్ సిక్స్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధిం చింది. వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్‌లో ఫలితా నిర్ధారించడానికి డక్‌వర్త్ లూయస్ విధానాన్ని అమలు పరిచా రు. విజయానికి 199 పరుగులు చేయాల్సిన స్కాట్‌లాంగ్ వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 35.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయ 125 పరుగులు చేసింది. తొలుత బ్యా టింగ్‌కు దిగిన వెస్టిండీస్ 48.4 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆ లౌటైంది. ఎవిన్ లూయస్ (66), మార్లొన్ సామ్యూల్స్ (51) అర్ధ శతకాలతో రాణించగా, స్కాట్‌లాండ్ బౌలర్లు సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లే వీల్ చెరి మూడు వికెట్లు సాధించారు. విండీస్ టాప్ ఆర్డర్‌ను వీరు దారుణంగా దెబ్బతీశారు. 36 పదరుగులి చ్చి రెండు వికెట్లు పడగొట్టిన మైఖేల్ లీస్క్ కూడా చక్కటి ప్రతి భ కనబరిచారు. దీనితో విండీస్ బ్యాట్స్‌మన్ పరుగులను సా ధించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. లూయస్, సామ్యూల్స్ క్రీజ్‌లో నిలదొక్కుకొని, హాఫ్ సెంచరీలు చేయకపోతే, ఆ జట్టు కు 198 పరుగుల స్కోరు కూడా సాధ్యమయ్యేది కాదు. ప్రపం చ ర్యాంకింగ్స్ వెనుకబడిన కారణంగా, వరల్డ్ కప్‌లో నేరుగా అర్హత పొందలేకపోయన వెస్టిండీస్ ఇప్పుడు అర్హతా పోటీల్లో ఆడాల్సి వస్తున్నది. సూపర్ సిక్స్ స్థాయకి చేరుకొని, అదే ఉత్సా హంతో ముందజ వేస్తున్నది. స్కాట్‌లాండ్‌తో ఉత్కంఠ భరి తంగా సాగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా, అనుకోకుండా వి జయాన్ని చేజిక్కించుకుంది. కాగా, 199 పరుగులు సాధించి, విండీస్‌ను కంగు తినిపించాలన్న పట్టుదలతో బ్యాటింగ్‌కు ది గిన స్కాట్‌లాండ్ ఆచితూచి ఆడింది. ఆరంభంలో కొంత తడ బడినప్పటికీ, మిడిల్ ఆర్డర్‌లో జార్జి మునే్స, రిచీ బెరింగ్టన్ ఆ దుకోవడంతో ఆ జట్టు కోలుకుంది. బెరింగ్టన్ 33 పరుగులు చేసి ఔట్‌కాగా, మునే్స 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మైఖేల్ లీస్క్ 14 పరుగులతో అతనికి తోడుగా ఉన్నాడు. అప్ప టికి 35.2 ఓవర్లు ముగిశాయ. విజయానికి ఇంకా 54 పరుగుల దూరంలో నిలిచిన స్కాట్‌లాండ్ తన లక్ష్యాన్ని ఛేదించే అవకా శాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు సైతం అభిప్రాయప డ్డారు. అయతే, ఈ దశలోనే భారీ జల్లులు పడడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మళ్లీ మ్యాచ్‌ని కొనసాగించే అవకాశాలు ఎంతకూ కనిపించకపోవడంతో, డక్‌వర్త్ లూయస్ విధానంలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలని నిర్ణయంచారు. ఈ పద్ధతిలో విం డీస్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిందని ప్రకటిం చారు. కాగా, ఈ పోటీల్లో భాగంగా గురువారం నాటి మ్యాచ్ లో జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడతాయ. 23న అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. 25న ఫైనల్ జరుగుతుంది.