క్రీడాభూమి

400 క్లబ్‌లో బ్రాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో 400 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. న్యూజిలాండ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో టామ్ లాథమ్ వికెట్‌ను పడగొట్టిన అతను కెరీర్‌లో 400వ టెస్టు వికెట్ సాధించాడు. మిడ్ వికెట్ స్థానంలో క్రిస్ వోక్స్ చక్కటి క్యాచ్‌ని అందుకొని బ్రాడ్‌కు చిరస్మరణీయ వికెట్‌ను అందించాడు. 115 టెస్టు ఆడుతున్న బ్రాడ్ అత్యంత వేగంగా నాలుగు వందల వికెట్లు సాధించిన ఇంగ్లాండ్ బౌలర్‌గా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. కాగా, ఈ ఫీట్‌ను అందుకున్న ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ రెండోవాడు. జేమ్స్ ఆండర్సన్ 134 టెస్టుల్లో 523 వికెట్లు కూల్చాడు.