క్రీడాభూమి

నటాలీ ఆల్‌రౌండ్ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 23: ముక్కోణపు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రీడాకారిణి నటాలీ సివర్ ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి, ఆస్ట్రేలియాపై తన జట్టుకు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించిపెట్టింది. ఆస్ట్రేలియాను 149 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లాండ్ ఆతర్వాత లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే, కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో రెండు వికెట్లు పడగొట్టిన నటాలీ బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యాన్ని కనబరచి, 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఇంగ్లాండ్ విజయంలో కీలక భూమిక పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. రాచెల్ హేన్స్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అలిసా హీలీ 31, ఆష్లే గార్డ్‌నర్ 28 చొప్పున పరుగులు చేశారు. నటాలీ 29 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన జెన్నీ గన్ 26 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టింది. వీరిద్దరి విజృంభణను సమర్థంగా అడ్డుకోలేకపోయిన ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ఆరంభంలో తడబాటు..
తొలి మ్యాచ్‌లో భారత్‌పై విజయభేరి మోగించిన ఆస్ట్రేలియాను ఓడించేందుకు 150 పరుగులు చేయాల్సిన ఇంగ్లాండ్ ఆరంభంలో తడబడింది. బ్రియోనీ స్మిత్ (1), డానియేలా వాట్ (18) పరుగుల వేటలో విఫలమై తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే, ఆతర్వాత టామీ బ్యూవౌంట్, నటాలీ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరూ ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎలాంటి ఇబ్బది లేకుండా ఎదుర్కొని, 17 ఓవర్లలోనే స్కోరును 150 పరుగులకు చేర్చారు. ఇంగ్లాండ్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసే సమయానికి నటాలీ 68 (43 బంతులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), టామీ బ్యూవౌంట్ 58 (44 బంతులు, 8 ఫోర్లు) నాటౌట్‌గా ఉన్నారు. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచిన నటాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

చిత్రం..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నటాలీ