క్రీడాభూమి

సుల్తాన్ అజ్లన్ షా హాకీ - ఆసీస్ చేతిలో భారత్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, ఏప్రిల్ 7: సుల్తాన్ అజ్లన్ షా హాకీ టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియాను ఢీకొన్న భారత్ 1-5 తేడాతో చిత్తయింది. మొదటి మ్యాచ్‌లో తన స్థాయికి తగినట్టు ఆడలేకపోయినప్పటికీ, జపాన్‌ను 2-1 తేడాతో ఓడించిన సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు రెండో మ్యాచ్‌లో దారుణంగా ఓడింది. మ్యాచ్ ఐదో నిమిషంలోనే బ్లేక్ గోవర్స్ ద్వారా ఆసీస్‌కు తొలి గోల్ లభించింది. అయితే, ఎనిమిదో నిమిషంలోనే రూపీందర్ పాల్ సింగ్ ఈక్వెలైజర్‌ను సాధించాడు. కానీ, భారత్‌కు ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. 13వ నిమిషంలో జాక్ వెటన్ చేసిన గోల్‌తో 2-1 ఆధిక్యానికి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా ఆతర్వాత దాడులను ముమ్మరం చేసింది. 20వ నిమిషంలో ఎడ్డీ ఒకెన్‌డియన్, 25వ నిమిషంలో సైమన్ ఆర్చర్డ్ గోల్స్ సాధించారు. ద్వితీయార్ధంలో మాట్ గోడెస్ (53వ నిమిషం) చేసిన గోల్‌తో ఆసీస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.