క్రీడాభూమి

విలియమ్‌సన్ రికార్డు సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడడానికి కొన్ని క్షణాల ముందే అతను గల్లీ స్థానానికి బంతిని పంపి, సింగిల్ చేయడం ద్వారా కెరీర్‌లో 18వ టెస్టు సెంచరీని సాధించాడు. న్యూజిలాండ్ తరఫున అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. మార్టిన్ క్రో, రాస్ టేలర్ చెరి 17 సెంచరీలతో ప్రస్తుతం సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. నిన్నటి వరకూ వీరి సరసన ఉన్న విలియమ్‌సన్ శుక్రవారం నాటి సెంచరీతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు.
*
ఆక్లాండ్, మార్చి 23: వర్షం కారణంగా ఆటకు పదేపదే అంతరాయం కలుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ నాలుగు వికెట్లకు 229 పరుగులు చేసింది. కేన్ విలియమ్‌సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించడం రెండో రోజు ఆటలో విశేషం. ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 58 పరుగులకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్ ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించి, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 175 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఉదయం ఆటను కొనసాగించిన విలియమ్‌సన్, హెన్రీ నికోల్స్ రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. 91 పరుగుల స్కోరువద్ద రెండో రోజు ఆటను మొదలుపెట్టిన విలియమ్‌సన్ జాగ్రత్తగా ఆడుతూ సెంచరీని పూర్తి చేశాడు. ఈ దశలో వర్షం కురవడంతో సుమారు గంటసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఆట తిరిగి మొదలైన తర్వాత, విలియమ్‌సన్ తన స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి, జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. థర్డ్‌డౌన్ ఆటగాడు వాల్టింగ్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించిన నికోల్స్ అర్ధ శతకానికి సమీపంలో నిలిచాడు. కాగా, మరోసారి భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. అప్పటికి న్యూజిలాండ్ 92.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 229 పరుగులు చేసింది. నికోల్స్ 49, వాల్టింగ్ 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆతర్వాత వర్షం తగ్గకపోవడంతో, రెండో రోజు ఆటను ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. మొత్తం మీద ఇంగ్లాండ్ కంటే న్యూజిలాండ్ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్న కారణంగా, ఈ మ్యాచ్‌పై కివీస్ పట్టు బిగించడం ఖాయంగా కనిపిస్తున్నది.

చిత్రం..విలియమ్‌సన్