క్రీడాభూమి

వరల్డ్ కప్‌కు అఫ్గాన్ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారేలో శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించిన అఫ్గానిస్తాన్ క్రికెటర్ల ఆనందం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు సాధించింది. పాల్ స్టిర్లింగ్ 55, కెవిన్ ఒబ్రియాన్ 41, నీల్ ఒబ్రియాన్ 36 చొప్పున పరుగులు సాధించారు. రషీద్ ఖాన్ 40 పరుగులకు 3, దల్వత్ జద్రాన్ 54 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గాన్ 49.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. మహమ్మద్ షాజాద్ 54, గుల్బదిన్ నరుూబ్ 45 పరుగులు చేయగా, అజర్ స్టానిక్‌జయ్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు