క్రీడాభూమి

కామన్ వెల్త్ లో రాణిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగేళ్ల క్రితం మెదడువాపు వ్యాధికి గురై, చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేరిన శ్రీకాంత్ మృత్యువుతో పోరాడాడు. విజేతగా నిలిచాడు. ఈ నాలుగేళ్లలో ఎంతో అనుభవంతోపాటు, ఆటలో నైపుణ్యాన్ని కూడా పెంచుకున్నాడు. 2014 కామన్ వెల్త్ గేమ్స్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన అతను ఈసారి టైటిల్‌పై కన్నేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరచుకుంటూ వస్తున్న అతను నంబర్ వన్‌గా ఎదగాలన్న పట్టుదలతో ఉన్నాడు. అదే సమయంలో, కామన్ వెల్త్ గేమ్స్‌లో టైటిల్ సాధించి సత్తాను నిరూపించుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. అతనికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
*
న్యూఢిల్లీ, మార్చి 23: వచ్చే నెల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగే కామనె్వల్త్ గేమ్స్‌లో రాణిస్తానని, అక్కడ పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. నాలుగేళ్ల క్రితం గ్లాస్గోలో కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందే శ్రీకాంత్ అనారోగ్యంతో బాధపడ్డాడు. బ్రెయిన్ ఫీవర్ కారణంగా అతనికి సుమారు రెండు వారాలపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సి వచ్చింది. గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న అతను బాత్‌రూమ్‌లో కళ్లుతిరిగి పడిపోవడంతో, అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ ఫీవర్‌గా నిర్ధారించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. అయితే, అప్పటి సంఘటన తనకు అంతగా గుర్తులేదని శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. నిజానికి ఏం జరిగిందనే విషయాన్ని కూడా తనకు ఎవరూ చెప్పలేదన్నాడు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ బాడ్మింటన్‌ను కొనసాగించిన అతను కామనె్వల్త్ గేమ్స్ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. సింగపూర్‌కు చెందిన డెరెక్ వాన్ చేతిలో అతను శ్రీకాంత్ 10-21, 21-12, 12-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. అప్పుడు కోల్పోయిన అవకాశాన్ని ఈసారి చేక్కించుకోవడమే తన లక్ష్యమని శ్రీకాంత్ స్పష్టం చేశాడు. నాలుగేళ్ల క్రితం పారుపల్లి కశ్యప్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న విషయాన్ని అతను గుర్తుచేస్తూ, అదే ఒరవడిని కొనసాగిచాలన్న పట్టుదలతో ఉన్నట్టు చెప్పాడు. ఇటీవల కాలంలో తన ఆట బాగా మెరుగుపడిందని తెలిపాడు. ఆత్మవిశ్వాసం పెరిగిందని, ప్రత్యేకించి గత ఏడాది సాధించిన పతకాలను తనపై తనకు నమ్మకాన్ని పెంచాయని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, గోల్డ్ కోస్ట్‌లో టైటిల్‌ను అందుకొని, ప్రకాష్ పదుకొనే (1978), సయ్యద్ మోదీ (1982), పారుపల్లి కశ్యప్ (2014) సరసన చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని అన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, ప్రపంచ నంబర్ వన్ స్థానం కంటే దేశానికి పతకాన్ని అందించడంలోనే తనకు ఆనందం ఉంటుందని స్పష్టం చేశాడు. పట్టుదలతో కృషి చేస్తూ, విజయాలను సాధిస్తుంటే, ర్యాంకింగ్స్ మెరుగుపడడం అసాధ్యమేమీ కాదని 25 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. తన సోదరుడు నందగోపాల్ స్ఫూర్తితో బాడ్మింటన్‌లోకి అడుగుపెట్టిన శ్రీకాంత్‌కు హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడెమీలో చేరడం కొత్త జీవితాన్నిచ్చింది. 2014 చైనా ఓపెన్ ఫైనల్‌లో రెండు పర్యాయాలు ఒలింపిక్ చాంపియన్‌గా, ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన లిన్ డాన్‌ను ఓడించి శ్రీకాంత్ టైటిల్ సాధించడం సంచలనం సృష్టించింది. అతని పేరు బాడ్మింటన్ ప్రపంచంలో మారుమోగి పోయింది. ఆతర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ శ్రీకాంత్ ప్రపంచ మేటి బాడ్మింటన్ క్రీడారుల్లో ఒకడిగా నిలిచాడు. సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ వంటి టైటిళ్లు అతని ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిన శ్రీకాంత్ ఇప్పుడు కామనె్వల్త్ గేమ్స్‌పై దృష్టి కేంద్రీకరించాడు. గోల్డ్ కోస్ట్‌లో టైటిల్ సాధిస్తే, అదే ఊపుతో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం వేటను కొనసాగించవచ్చని అతని ఆలోచనగా కనిపిస్తున్నది. అనుకున్నది సాధించే సామర్థ్యం ఉన్న శ్రీకాంత్ గోల్డ్ కోస్ట్ నుంచి పతకంతో తిరిగి వస్తాడని అభిమానులు విశ్వాసంతో ఉన్నారు.