క్రీడాభూమి

సన్నాహాలు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సత్తా చాటేందుకు ఎనిమిది జట్లు
సన్నాహాలను ముమ్మరం చేశాయి. చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే నెట్స్‌లో శ్రమిస్తున్నారు. డిఫెండింగ్ చాంపి
యన్ ముంబయి ఇండియన్స్, మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌సహా అన్ని ఫ్రాంచైజీలు టైటిల్‌పై కనే్నశాయి. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై రెండేసి సంవత్సరాల సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో, వాటి స్థానాల్లో కొత్తగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ చేరాయి. చెన్నై, రాజస్తాన్ జట్లకు చెందిన ఆటగాళ్లు వేలంలో వివిధ ఫ్రాంచైజీలకు వెళ్లాల్సి వచ్చింది. గుజరాత్ లయన్స్‌కు సురేష్ రైనా, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో, ఒకప్పుడు చెన్నైలో కలిసి ఆడిన వీరిద్దరి మధ్య పోరు ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిని రేపుతోంది. కాగా, తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలా రెండు పర్యాయాలు విజేతగా నిలిచాయి. మొదటి రెండు ఐపిఎల్ టోర్నీలను వరుసగా రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ గెల్చుకున్నాయి. ఈసారి టైటిల్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. జయాపజయాలపై ఎవరి అంచనాలు వారికి ఉండగా, ఉత్కంఠ పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆటగాళ్ల మధ్య ఆధిపత్య పోరు!
కాగా, జాతీయ జట్టులో మళ్లీ స్థానం కోసం ప్రయత్నిస్తున్న కొంత మంది ఆటగాళ్లతోపాటు, సీనియర్ జట్టులోకి వచ్చేందుకు పోటీపడుతున్న యువ క్రికెటర్లు ఎంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. ఫిట్నెస్ సమస్య నుంచి మహమ్మద్ షమీ ఎంత వరకూ కోలుకున్నాడన్నది ఈ టోర్నీలో స్పష్టమవుతుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున అతను బరిలోకి దిగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవలే గుడ్‌బై చెప్పిన జహీర్ ఖాన్ ఈ జట్టు కెప్టెన్. ఇంగ్లాండ్‌తో జరిగిన టి-20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి ఓవర్ మొదటి నాలుగు బంతులను సిక్సర్లుగా మార్చేసి, అసాధ్యంగా కనిపించిన విజయాన్ని సుసాధ్యం చేసిన వెస్టిండీస్ ఆటగాడు కార్లొస్ బ్రాత్‌వెయిట్, దక్షిణాఫ్రికా స్టార్లు జీన్ పాల్ డుమినీ, క్వింటన్ డికాక్, ఇమ్రాన్ తాహిర్ ఈ జట్టులోనే ఉన్నారు. ఐపిఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన భారతీయుల జాబితాలో అగ్రస్థానం ఆక్రమించిన పవన్ నేగీ, యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ కూడా ఢిల్లీ జట్టు సభ్యులే. కొత్తగా ఐపిఎల్‌లో ప్రవేశించిన గుజరాత్ లయన్స్‌లో సురేష్ రైనా, చెన్నై సూపర్ కింగ్స్‌లో అతని సహచరుడు రవీంద్ర జడేజా, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రేవో, ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ వంటి మేటి క్రికెటర్లు ఉన్నారు. డేవిడ్ మిల్లర్ నాయకత్వం వహిస్తున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లో ఇటీవల భారత జట్టులోకి వచ్చిన గుర్‌కీరత్ సింగ్ మాన్, మిచెల్ జాన్సన్, గ్లేన్ మాక్స్‌వెల్, షాన్ మార్ష్, మోహిత్ శర్మ, మురళీ విజయ్ తదితర స్టార్ క్రికెటర్లున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గౌతం గంభీర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టులో బ్రాడ్ హాగ్, మోర్న్ మోర్కెల్, యూసుఫ్ పఠాన్, ఆండ్రె రసెల్, షకీబ్ అల్ హసన్, ఉమేష్ యాదవ్ తదితరులు సత్తా చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. ముంబయి ఇండియన్స్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ మెక్‌క్లీన్‌గన్, హార్దిక్ పాండ్య, అతని సోదరుడు కృణాల్ పాండ్య, టిమ్ సౌథీ, లెండల్ సిమన్స్ తదితరులు అభిమానులు ఆకర్షిస్తున్నారు. ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌లో బాబా అపరాజిత్, అశోక్ దిండా, ఫఫ్ డు ప్లెసిస్, మిచెల్ మార్ష్, ఈశ్వర్ పాండే, ఇర్ఫాన్ పఠాన్, కెవిన్ పీటర్సన్, ఇశాంత్ శర్మ తదితరులు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టార్ అట్రాక్షన్‌కాగా, వరుణ్ రాన్, సామ్యూల్ బద్రీ, ఎబి డివిలియర్స్, హర్షల్ పటేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్, మోజెస్ హెన్రిక్స్, దీపక్ హూడా, అభిమన్యు మిథున్, ఇయాన్ మోర్గాన్, ముస్త్ఫాజుర్ రహ్మాన్ వంటి మేటి క్రికెటర్లు ఉన్నారు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అందరినీ ఆకట్టుకోనున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించిన అతను ఆసియా కప్, టి-20 వరల్డ్‌కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో అద్భుతంగా రాణించాడు. యువ ఆటగాళ్లకు అతను గట్టిపోనివ్వడం విశేషం. క్రికెట్ రంగంలో పేరున్న ఆటగాళ్లంతా ఏ విధంగా ఆడతారో చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పరుగులు పెట్టనున్నారు. లీగ్ దశలో 56, మూడు ప్లేఆఫ్‌లు, ఒక ఫైనల్‌సహా మొత్తం 60 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయ. ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ మధ్య మొదటి మ్యాచ్ శనివారం జరుగుతుంది. ఈటోర్నీలో తమతమ అభిమాన క్రికెటర్లు ఏ విధంగా రాణిస్తారన్న ఉత్కం ఠ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. మొత్తం మీద అభిమానులను అలరించడానికి ఐపిఎల్ మరోసారి సిద్ధమవుతోంది. అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయ. ఫలితంగా ఈసారి పోరు ఆసక్తికరం గా మారనుంది.
వివిధ జట్ల
బలాబలాలు..
ఐపిఎల్.. క్రికెట్ మ్యాచ్‌లను ఉద్విగ్నంగా, థ్రిల్లింగ్‌గా మార్చేసింది. మ్యాచ్‌లను చూస్తున్న వారంతా మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతారు. ఆటగాళ్లతో మమేకమవుతారు. కొత్తకొత్త పోకడలతో ఐపిఎల్ ఎప్పటికీ నవ వధువుగానే దర్శనమిస్తున్నది. ఈ పోటీల్లో ఇప్పటి వ రకూ ఆడిన జట్ల బలాబలాలు ఇలావున్నాయ. వీటిలో కొన్ని జట్లు వివిధ కారణాల వల్ల ఈసా రి బరిలోకి దిగడం లేదు.
చెన్నై సూపర్ కింగ్స్: రెండు సార్లు (2010, 2011) టైటిళ్లు గెల్చుకున్న ఈ జట్టు నాలుగు పర్యాయాలు (2008, 2012, 2013, 2015) రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఒకసారి నాలుగు (2009), మరోసారి మూడు (2014) స్థానాల్లో నిలిచింది.
(లోధా కమిటీ రెండేళ్ల సస్పెన్షన్‌ను విధిం చడంతో ఈసారి టోర్నీ నుంచి దూరమైంది).
కోల్‌కతా నైట్ రైడర్స్: చెన్నై సూపర్ కింగ్స్ మాదిరే కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా రెండు పర్యాయాలు (2012, 2014) టైటిళ్లను గెల్చుకుంది. ఒక సారి నాలుగు (2011), రెండు సార్లు ఆరు, మరోసారి ఏడు (2013), ఒకసారి ఎనిమిది (2009) స్థానాలను సంపాదించింది.
రాజస్థాన్ రాయల్స్: మొదటి ఐపిఎల్‌ను (2008) సాధించిన జట్టులో రికార్డు పుస్తకాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన రాజస్థాన్ రాయల్స్, ఒకసారి మూడు (2013), ఒకసారి ఐదు (2014) స్థానాల్లో నిలిచింది. రెండుసార్లు ఆరు (2009, 2011), మరో రెండుసార్లు ఏడు (2010, 2012) స్థానాలను సంపాదించుకుంది.
(లోధా కమిటీ రెండేళ్ల సస్పెన్షన్‌ను విధిం చడంతో ఈసారి టోర్నీ నుంచి దూరమైంది).
ముంబయి ఇండియన్స్: ఎంతో మంది పేరున్న ఆటగాళ్లతో కూడిన ముంబయి ఇండియన్స్ రెండు సార్లు (2013, 2015) ఐపిఎల్ విజేతగా నిలిచింది. ఒకసారి (2010) ఫైనల్‌లో ఓటమిపాలై రన్నరప్ ట్రోఫీని స్వీకరించింది. ఒకసారి మూడు (2011), రెండుసార్లు నాలుగు (2012, 2014), ఒకసారి ఐదు (2008), మరోసారి ఏడు (2009) చొప్పున స్థానాలతో సంతృప్తి చెందింది.
(ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ జట్టు బరిలోకి దిగుతున్నది).
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రెండు సార్లు (2009, 2011) ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ సాధించలేకపోయిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 2010లో మూడు, 2012 తిరిగి 2013 సంవత్సరాల్లో ఐదు, 2008 తిరిగి 2014 సంవత్సరాల్లో ఏడు స్థానాల్లో నిలిచింది.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: గత ఏడాది ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని రన్నరప్ ట్రోఫీకి పరిమితమైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 2008లో మూడు, 2009, 2011లో ఐదు, 2012, 2013లో ఆరు, 2010లో ఎనిమిది స్థానాల్లో నిలిచింది.
ఢిల్లీ డేర్ డెవిల్స్: అత్యుత్తమంగా రెండుసార్లు (2009, 2012) మూడో స్థానాన్ని ఆక్రమించింది. 2008లో నాలుగు, 2010లో ఐదు, 2014లో ఎనిమిది, 2013లో తొమ్మిది, 2011లో పది స్థానాల్లో నిలిచింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి వలస వెళ్లిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా గౌతం గంభీర్ అసాధాణ ప్రతిభ కనబరచడం విశేషం.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐపిఎల్ కెరీర్‌ను 2013లో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస సంవత్సరాల్లో ఐదు, ఆరు స్థానాలను పొందింది.
డక్కన్ చార్జర్స్: మొత్తం మీద ఐదు ఐపిఎల్ టోర్నీల్లో పాల్గొన్న డక్కన్ చార్జర్స్‌ను టోర్నమెంట్ కమిటీ రద్దు చేసింది. మొదటి ఐపిఎల్ (2008)లో ఎనిమిదో స్థానంలో నిలిచిన ఈ జట్టు మరుసటి సంవత్సరమే (2009) టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. 2010లో నాలుగు, 2011లో ఏడు, 2012లో ఎనిమిది స్థానాలకు పరిమితమైంది.
(ఐపిఎల్‌లో స్థానం కోల్పోయంది).
పుణే వారియర్స్: కేవలం మూడు ఐపిఎల్స్‌లో ఆడిన పుణే వారియర్స్ 2011 తిరిగి 2012లో తొమ్మిది, 2013లో ఎనిమిది స్థానాల్లో నిలిచింది.
(ఐపిఎల్‌లో స్థానం కోల్పోయంది)
కొచ్చి టస్కర్స్ కేరళ: కేవలం ఒకేసారి (2011) ఐపిఎల్‌లో ఆడిన కొచ్చి టస్కర్స్ కేరళ ఆ టోర్నీలో 8వ స్థానానికి పరిమితమైంది.
(ఐపిఎల్‌లో స్థానం కోల్పోయంది).

విజేత జట్లు ఇవే..
2008: రాజస్థాన్ రాయల్స్ (రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్/ సెమీ ఫైనలిస్ట్స్- ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), 2009: డక్కన్ చార్జర్స్ (రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ సెమీ ఫైనలిస్ట్స్-్ఢల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్), 2010: చెన్నై సూపర్ కింగ్స్ (రన్నరప్ ముంబయి ఇండియన్స్/ ఫైనలిస్ట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డక్కన్ చార్జర్స్), 2011: చెన్నై సూపర్ కింగ్స్ (రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ ఫైనలిస్ట్స్- ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్), 2012: కోల్‌కతా నైట్ రైడర్స్ (రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్/ ఫైనలిస్ట్స్‌‌ల- ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబయి ఇండియన్స్), 2013: ముంబయి ఇండియన్స్ (రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్/ ఫైనలిస్ట్స్- రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్), 2014: కోల్‌కతా నైట్ రైడర్స్ (రన్నరప్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ ఫైనలిస్ట్స్‌‌ల- చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్), 2015: ముంబయ ఇండియన్స్ (రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్/ ఫైనలిస్ట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ రాజస్థాన్ రాయల్స్).

మీకు తెలుసా?
మొట్టమొదటి ఆటగాళ్ల వేలం 2008 ఫిబ్రవరి 20వ తేదీన జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీకి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు ఆరు కోట్ల రూపాయలు) చెల్లించింది. మొదటి వేలంలో ఇదే అత్యధిక మొత్తం. ఈ ఏడాది షేన్ వాట్సన్‌కు అత్యధికంగా 9.5 కోట్ల రూపాయల ధర పలికింది.