క్రీడాభూమి

తొలి రెండు వారాలు ఐపిఎల్‌కు యువీ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్న ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తొలి రెండు వారాలు ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇటీవల ముగిసిన టి-20 ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా కాలి మడమకు తగిలిన గాయం నుంచి యువరాజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. ‘యువరాజ్ రెండు వారాల పాటు మా జట్టుకు దూరమవడం విచారకరం. అతను పూర్తిగా కోలుకునేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియదు’ అని సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ పేర్కొన్నట్లు ‘ఐపిఎల్‌టి20.కామ్’ వెల్లడించింది. పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో స్పెషలిస్టుగా పేరు పొందిన యువరాజ్ సింగ్ ఐసిసి టి-20 ప్రపంచ కప్ టోర్నీలో కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాపై భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. అయితే అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించే ‘మ్యాచ్ విన్నర్’గానే కాకుండా, మిడిల్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ కూడా చేయగలిగే యువరాజ్ సింగ్ లాంటి ఆటగాడు ఉండటం ఏ జట్టుకైనా ఎంతో ముఖ్యమేనని మూడీ స్పష్టం చేశాడు. ఇటీవల జరిగిన ఐపిఎల్-9 ఆటగాళ్ల వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్ విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించడం జరిగిందని, అందుకే యువరాజ్ సింగ్, దీపక్ హుడా లాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నామని ఆయన చెప్పాడు.