క్రీడాభూమి

ఐపిఎల్ మ్యాచ్‌లు తరలిపోతే వంద కోట్లు నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీ ముంబయి, ఏప్రిల్ 9: ఐపిల్ మ్యాచ్‌లు మరో ప్రాంతానికి తరలిపోతే ఎంత నష్టం వస్తుంది? కోట్ల రూపాయల్లోనే గండి పడుతుందని, ఈ మొత్తం కనీసం వంద కోట్ల రూపాయలు ఉంటుందని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఒకవేళ మ్యాచ్‌లు మరో ప్రాంతానికి తరలి వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంఘ్రతి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేయా, ఠాకూర్ మాత్రం భారీ నష్టం తప్పదని హెచ్చరించాడు. రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతుంటే, లక్షల లీటర్ల నీటిని ఐపిఎల్ మ్యాచ్‌లకు వినియోగించడంపై దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారిస్తున్నది. పిటిషన్ ఆలస్యంగా దాఖలైంది కాబట్టి శనివారం నాటి మ్యాచ్‌ని అడ్డుకోలేదని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, తదుపరి మ్యాచ్‌లకు అనుమతిస్తుందా లేక మరో ప్రాంతానికి తరలించాలని ఆదేశిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. 12వ తేదీకి కేసు విచారణ వాయిదా పడడంతో ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే, మహారాష్ట్ర నుంచి మ్యాచ్‌లు తరలి వెళ్లడానికి తాము అభ్యంతరం పెట్టబోమని ముఖ్యమంత్రి ఇది వరకే తేల్చిచెప్పాడు. దీనితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదేమోనని బిసిసిఐ భయపడుతున్నది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లను నిర్వహించాలని ఆరాటపడుతున్నది. మహారాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని ఎరగా చూపుతున్నదనడానికి ఠాకూర్ ప్రకటన స్పష్టం చేస్తున్నది.