క్రీడాభూమి

అందరి కళ్లూ బ్రాత్‌వెయిట్‌పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొనేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సిద్ధంగా ఉంది. రెండు జట్లలోనూ చాలా మంది హేమాహేమీలు ఉన్నప్పటికీ, అందరి కళ్లూ కార్లొస్ బ్రాత్‌వెయిట్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. అతను ఏ విధంగా రాణిస్తాడన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల జరిగిన టి-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టిన బ్రాత్‌వెయిట్ వెస్టిండీస్‌కు టైటిల్‌ను సంపాదించడం పెట్టడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఐపిఎల్‌లో అతను ఏ విధంగా ఆడతాడన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ వ్యక్తమవుతున్నది. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేర్‌డెవిల్స్ జట్టులో బ్రాత్‌వెయిట్‌తోపాటు హార్డ్ హిట్టర్లు చాలా మందే ఉన్నారు. క్వింటన్ డికాక్, జెపి డుమినీ, శ్రేయాస్ అయ్యర్, కరుణ్ నాయర్ వంటి స్టార్లు పరుగుల వరదను పారించేందుకు బ్యాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్‌లో జరిగిన వేలంలో భారతీయులందరిలోకీ అత్యధిక మొత్తాన్ని పొందిన పవన్ నేగీ కూడా ఈ జట్టులో సభ్యుడే. అతనితోపాటు నాథన్ కౌల్టర్ నైల్, ఇమ్రాన్ తాహిర్, అమిత్ మిశ్రా, మహమ్మద్ షమీ తదితరుల బౌలింగ్ విభాగాన్ని నియంత్రించనున్నారు. కాగా, గౌతం గంభీర్ నాయకత్వం వహిస్తున్న నైట్‌రైడర్స్ జట్టులో రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. బౌలింగ్‌లో పీయూష్ చావ్లా, ఉమేష్ యాదవ్, జాసన్ హోల్డర్, మోర్న్ మోర్కెల్ తదితరులు కీలక పాత్రను పోషించనున్నారు. ఆండ్రె రసెల్, షకీబ్ అల్ హసన్ స్పెషలిస్టు ఆల్‌రౌండర్లుగా సేవలు అందిస్తారు. కాగితంపై చూస్తే కోల్‌కతా కంటే డేర్‌డెవిల్స్ బలంగా కనిపిస్తున్నది. అయితే, మాజీ చాంపియన్ నైట్‌రైడర్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభం.