క్రీడాభూమి

సైనా ఫిట్నెస్ డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 11: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్‌పై అనుమానాలకు తెరపడడం లేదు. మంగళవారం నుంచి సింగపూర్ సూపర్ సిరీస్ ఆరంభం కానుండగా, గతంలో ఒకసారి ఇక్కడ టైటిల్ సాధించిన సైనా మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేయాలన్న ఉత్సాహంతో ఉంది. 2010 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె తాయ్ జూ ఇంగ్‌ను 21-18, 21-15 తేడాతో ఓడించి టైటిల్ సాధించింది. ఆతర్వాత ఐదేళ్లలో మూడుసార్లు మాత్రమే ఈ టోర్నీకి హాజరుకాగలిగింది. కానీ, ఆమె పోరాటం క్వార్టర్ ఫైనల్స్ స్థాయిని కూడా దాటలేదు. కాగా, మరోసారి టైటిల్‌ను సాధించాలన్న పట్టుదల సైనాలో ఉన్నప్పటికీ, ఆమెను ఫిట్నెస్ సమస్య వేధిస్తున్నది. సుమారుగా ఏడాది కాలంగా ఆమె కాలి మడల గాయంతో బాధపడుతున్నది. శస్త్ర చికిత్స కూడా సరైన ఫలితం ఇవ్వలేదని ఆమె ఆడుతున్న తీరు స్పష్టం చేస్తున్నది. సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ, గత మూడు టోర్నీల్లో ఆమె సెమీస్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. స్విస్ గ్రాండ్ ప్రీ, ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్, మలేసియా సూపర్ సిరీస్‌లో సైనా సెమీస్ వరకూ దూసుకెళ్లి టైటిళ్లపై ఆశలు రేపింది. కానీ, ప్రతిసారీ సెమీస్‌లోనే ఓటమిపాలు కావడానికి కాలి గాయం కూడా ఒక కారణమన్న వాదన ఉంది. ఫిట్నెస్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నానని, కాలి నొప్పి పలుమార్లు తనను వేధిస్తున్నదని ఆమె అనేక సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఈ నేపథ్యంలో మంగళవారం క్వాలిఫయర్స్‌తో ప్రారంభం కానున్న సింగపూర్ సూపర్ సిరీస్‌లో ఆమె ఎంత వరకు రాణిస్తుందో చూడాలి. ఆమెతోపాటు మహిళల విభాగంలో పివి సింధు, పురుషుల విభాగంలో ప్రణయ్, అజయ్ జయరాం, కిడాంబి శ్రీకాంత్ తదితరులు కూడా పతకాల వేటను కొనసాగిస్తారు.

ఫిట్నెస్‌కు ప్రాధాన్యం
బాడ్మింటన్ జాతీయ చాంపియన్ సమీర్
న్యూఢిల్లీ: ఫిట్నెస్‌కే తాను మొదటి ప్రాధాన్యతనిస్తానని భారత జాతీయ బాడ్మింటన్ చాంపియన్ సమీర్ వర్మ అన్నాడు. కెరీర్ ఆరంభంలోనే ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నానని, ఫలితంగా కొన్ని టోర్నీలకు హాజరుకాలేకపోయానని సోమవారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 21 ఏళ్ల సమీర్ చెప్పాడు. 2012లో గాయాల సమస్య తను తీవ్రంగా వేధించిందని అన్నాడు. వెన్నునొప్పి కారణంగా ఎంతో బాధపడ్డానని, కోలుకున్న తర్వాత ఆటను కొనసాగించానని తెలిపాడు. అయితే, 2013లో మరోసారి వెన్నునొప్పి తిరగబెట్టిందని అన్నాడు. 2014లో అంపెడిసైటిస్ శస్తచ్రికిత్స జరిగిందని, ఈ విధంగా తరచు ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నానని వాపోయాడు. అయితే, గత కొంతకాలంగా తాను పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని, దీనిని కొనసాగించడానికి కృషి చేస్తానని అన్నాడు. అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణించడమే తన లక్ష్యమని చెప్పాడు. గత ఏడాది టాటా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నానని, ఆతర్వాత బహ్రైన్ లోనూ టైటిల్ సాధించానని అతను అన్నాడు. ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ చేరడం తనకు సంతృప్తినిచ్చిన అంశాల్లో ఒకటని అన్నాడు. భారత జాతీయ చాంపియన్‌గా ఎదగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ఫైనల్‌లో తన అన్న సౌరభ్ వర్మపై అతను 21-16, 21-16 తేడాతో విజయం సాధించి, కొత్త చాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తాను ప్రస్తుతం 38వ స్థానంలో ఉన్నానని అంటూ, గత ఏడాది ఆరంభంలో 262వ ర్యాంక్‌లో ఉన్నతాను చాలా తొందరగా ముందుకు వెళ్లగలిగానని చెప్పాడు. టాప్-10లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. గాయాల సమస్య లేకపోతే అంతర్జాతీయ సర్క్యూట్‌లో రాణించడం కష్టం కాదన్నాడు. ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా కెరీర్‌ను కొనసాగిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.