క్రీడాభూమి

ట్రాక్‌పైకి సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: బాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ గాయాల సమస్య నుంచి కోలుకొని, మళ్లీ ట్రాక్‌పైకి రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సైనా తన ఫిట్నెస్‌ను రుజువు చేసుకుంది. ‘తెలుగు తేజం’ పీవీ సింధును ఫైనల్‌లో ఓడించి, విజేతగా నిలిచిన హైదరాబాదీ సైనాకు అభిమానులు జేజేలు పలుకుతున్నారు. సింధు కూడా ఇక్కడి గోపీచంద్ అకాడెమీలోనే శిక్షణ పొందుతున్నప్పటికీ, ఆమె ఫిట్నెస్‌పై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్నది. అయితే, అదే స్థాయిలో దేశానికి పతకాలు సాధించిపెట్టే సత్తావున్న సైనా ఫిట్నెస్ ఇటీవల కాలంలో ప్రమాదకరంగా కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఆమె గతంలో మాదిరి ఆడలేకపోవడంతో నిన్నమొన్నటి వరకూ భయపడిన అభిమానులు కామనె్వల్త్‌లో విజయభేరి మోగించడంతో ఊరట చెందారు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధించిన తర్వాత తన కెరీర్‌లో ఇదే తన అత్యుత్తమ ప్రదర్శనగా సైనా అభివర్ణించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప తకం, తిరిగి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం తన లక్ష్యాలుగా పే ర్కొంది. ఈ రెండూ అసాధ్యాలు కావన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కాలి నొప్పి వేధిస్తున్నది!
ఫిట్నెస్ సమస్య కొంత వరకూ తగ్గుముఖం పట్టినప్పటికీ, కాలి నొప్పి ఇప్పటికీ వేధిస్తునే ఉందని సైనా చెప్పింది. అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడడం వల్ల కాలు కదపలేని పరిస్థితి వస్తున్నదని తెలిపింది. అయితే, గతంతో పోలిస్తే ఇప్పుడు ఫిట్నెస్ సమస్య ఎక్కువగా లేదని అన్నది. సింధును ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చిందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా చెప్పింది. ఇటీవల కాలంలో ఐదు కిలోల బరువు తగ్గానని, దీనివల్ల కోర్టులో వేగంగా కదలగలిగానని తెలిపింది. తన పతకాన్ని తల్లిదండ్రులకు, దేశానికి బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించింది.
తన తండ్రికి గుర్తింపు కార్డునిచ్చి, కామనె్వల్త్ గేమ్స్‌కు అనుమతించాలని లేకపోతే, తాను పోటీ నుంచి వైదొలుగతానని చేసిన ప్రకటనను సైనా సమర్థించుకుంది. తన తండ్రి కోసం, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాంటి పోరుకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేసింది. దేశానికి కంటే తాను తండ్రి గుర్తింపు కార్డుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని వచ్చిన విమర్శలను ఆమె తోసిపుచ్చింది. తనకు వ్యక్తిగత కోచ్‌ని తీసుకెళ్లే అవకాశం ఉందని, అందుకే, తన తండ్రికి అదే గుర్తింపు కావాలని కోరానని చెప్పింది. అవసరమైతే, ఆయనకు గోల్డ్ కోస్ట్‌లో ఏదో ఒక హోటల్‌లో గది తీసుకొని బసను ఏర్పాటు చేయగలనని, కానీ, సిద్ధాంతపరంగానే తాను అధికారుల తీరును వ్యతిరేకించానని వివరించింది. దేశానికి పతకాలను సాధించిపెడుతున్నాననే విషయాన్ని విమర్శకులు మరచిపోకూడదని వ్యాఖ్యానించింది.