క్రీడాభూమి

వెన్నునొప్పి ఉంటేనేం? చేతులు బలంగా ఉన్నాయి: ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలి, ఏప్రిల్ 16: వెన్ను నోప్పితో బాదపడుతున్నప్పటికీ, తన చేతులు బంలంగా ఉన్నాయని, ఐపీఎల్‌లో జరగబోయే మ్యాచ్‌ల్లో తప్పకుండా పాల్గొంటానని అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 44 బంతుల్లో 79 పరుగులు చేసినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాన్ని అపలేకపోయాడు. అందుకు ముందు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ధోనీ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఫిజియో సాయం కూడా తీసుకున్నాడు. ఆ పరిస్థితుల్లో అతను బ్యాటింగ్‌కు దిగడేమోనన్న అనుమానాలు తలెత్తాయ. కానీ, జట్టు ప్రయోజనాల కోసం అతను మైదానంలోకి వచ్చాడు. చివరి వరకూ నాటౌట్‌గా నిలిచాడు. అయతే, కేవలం నాలుగు పరుగుల తేడాతో చెన్నై ఓటమిపాలైంది. కాగా, దేవుడు తనకు శక్తి ఇచ్చాడాని వెన్ను నొప్పితో బాధపడినప్పటికీ, జట్టు విజయం కోసం కృషి చేశానని అతను ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. వెన్నునొప్పి ఉన్నప్పటికీ, చేతులు బలంగా ఉంటే ధాటిగా బ్యాటింగ్ చేయవచ్చని వ్యాఖ్యానించాడు.