క్రీడాభూమి

విజయ్ హజారే ట్రోఫీతో దేశవాళీ సీజన్ మొదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 16: వనే్డ ఫార్మాట్‌లో జరిగే విజయ్ హజారే ట్రోఫీతో 2018-19 దేశవాళీ క్రికెట్ సీజన్‌ను మొదలు పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ ప్రతిపాదించింది. రంజీ ట్రోఫీలో అదనంగా మరో రౌండ్ మ్యాచ్‌లను నిర్వహించాలని కూడా సోమవారం ఇక్కడ సమారు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో తీర్మానించి, బీసీసీఐ పరిశీలనకు పంపింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎస్‌జీ బంతుల స్థానంలోనే కూకబురా బంతులను వాడాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేసింది. రంజీల్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఉండాలని చాలా రాష్ట్రాల కెప్టెన్లు, కోచ్‌లు కోరుతున్నారని, అందుకే అదనంగా మరో రౌండ్ మ్యాచ్‌ల ప్రతిపాదన చేశామని పేరు చెప్పడానికి ఇష్టపడని సౌరవ్ గంగూలీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న టెక్నికల్ కమిటీలోని ఒక సభ్యుడు పీటీఐతో మాట్లాడుతూ చెప్పాడు. దేశంలో పశ్చిమ ప్రాంతంలో నీటి చుక్క లభించక, కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, అదే విధంగా అక్టోబర్ మాసం వరకూ తూర్పు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయనీ ఆ సభ్యుడు అన్నాడు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, సీజన్ ఆరంభంలోనే విజయ్ హజారే ట్రోఫీని నిర్వహించడం శ్రేయస్కరంగా ఉంటుందని టెక్నికల్ కమిటీ అభిప్రాయపడినట్టు చెప్పాడు. ఈ పోటీల తర్వాత రంజీ ట్రోఫీ, ఆతర్వాత టీ-20 ఫార్మాట్‌లో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఉండేలా కొత్త సీజన్‌ను ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు. అక్టోబర్‌లో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు పలుమార్లు వర్షం వల్ల అంతరాయం కలుగుతున్న విషయాన్ని అతను గుర్తుచేశాడు. ఇలావుంటే, ఈ ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించిన తర్వాత బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుంది.