క్రీడాభూమి

సీఓఏతో విభేదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఓఏ) చేసిన ప్రతిపానతో టెక్నికల్ కమిటీ విభేదించింది. వచ్చే రంజీ సీజన్‌లో బీహర్‌ను కూడా చేర్చే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీఓఏ లిఖిత పూర్వకంగా చేసిన చూచనను టెక్నికల్ కమిటీ తోసిపుచ్చింది. సీఓఏ లేఖను మాజీ వికెట్‌కీపర్ సాబా కరీం సమావేశంలో చర్చకు ప్రవేశపెట్టినప్పుడు కమిటీ మొత్తం ఏకమై దానిని వ్యతిరేకించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బీహార్‌ను రంజీలో ఆడకుండా ఎలా అడ్డుకుంటారని సాబా కరీం ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, బీహార్‌ను అనుమతిస్తే, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు కూడా కోర్టును ఆశ్రీంచవనే గ్యారంటీ ఏమిటని పలువురు సభ్యులు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కొత్త నిబంధనావళిని బీసీసీఐ ఇంకా పూర్తి చేయలేదని, కాబట్టి పాత పద్ధతుల్లోనే రంజీ ట్రోఫీ జరగాల్సిందేనని అధిక శాతం మంది సభ్యులు అభిప్రాయపడినట్టు కమిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో సీఓఏ చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ భావిస్తున్నట్టు ఈ వర్గాలు స్పష్టం చేశాయి.