క్రీడాభూమి

డోప్‌ను ఉపేక్షించం: రాథోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఈ సమయంలో డోప్ సంఘటనలను ఉపేక్షించేది లేదని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌తో పాటు భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ), ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ)ల ప్రతినిధుల బృందంతో ఆయన సమవేశమయ్యాడు. ఇటీవల జాతీయ స్థాయిలో పాఠశాలల క్రీడలను విజయవంతంగా నిర్వహించామని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ తెలిపాడు. పారదర్శకంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నామని ఐఓఏ అధ్యక్షుడు బాచ్‌కు మంత్రి వివరించాడు. కాగా, దేశంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బాచ్ అభినందించాడు.