క్రీడాభూమి

ఐసీసీ వరల్డ్ ఎలెవెన్‌లో అఫ్రిదీ, మాలిక్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఏప్రిల్ 19: వెస్టిండీస్‌లో పర్యటించే ఐసీసీ టీ-20 ఎలెవెన్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు షహీద్ అఫ్రిదీ, షోయబ్ మాలిక్‌కు చోటు దక్కింది. ఇంగ్లాండ్ వనే్డ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించే ఐసీసీ జట్టులో శ్రీలంక స్టార్ బౌలర్ తిసర పెరెరా కూడా ఉన్నాడు. గత ఏడాది ‘ఇర్నా’, ‘మరియా’ తుపాన్లు సృష్టించిన బీభత్సంలో వెస్టిండీస్‌లోని చాలా స్టేడియాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సాయం అందించాలని నిర్ణయించిన ఐసీసీ వచ్చేనెల 31న లార్డ్స్ మైదానంలో ఒక ఛారిటీ మ్యాచ్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. కార్లొస్ బ్రాత్‌వెయిట్ నాయకత్వం వహిస్తున్న వెస్టిండీస్‌తో తలపడే ఐసీసీ జట్టులో చోటు దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నానని 2009లో జరిగిన టీ-20 ప్రపంచ కప్‌ను గెల్చుకున్న పాకిస్తాన్ జట్టులో షోయబ్ మాలిక్‌తోపాటు సభ్యుడిగా ఉన్న అఫ్రిదీ ఒక ప్రకటనలో తెలిపాడు. క్రికెట్ ప్రపంచానికి వెస్టిండీస్ ఎంతో గొప్ప సేవలు అందించిందని, ఇప్పుడు అక్కడి క్రికెట్‌కు ఉపయోగపడే ప్రయత్నానికి సహకరించడం తన కర్తవ్యమని పేర్కొన్నాడు. మాలిక్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌ను బలమైన జట్టుగా అతను అభివర్ణించాడు. కరేబియా దీవుల్లో తుపాను కారణంగా విపరీతమైన ఆస్తి నష్టం జరిగిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. క్రికెట్ మైదానాలు కూడా దెబ్బతిన్నాయని, వాటిని తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి భారీగా ఖర్చవుతుందని అన్నాడు. ఛారిటీ మ్యాచ్ ద్వారా భారీగానే నిధులు సమకూరుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014లో టీ-20 వరల్డ్ కప్‌ను శ్రీలంక కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన తిసర పెరెరా సైతం క్రికెట్‌లో వెస్టిండీస్‌కు ఉన్న కీలక స్థానాన్ని ప్రస్తావించాడు. అక్కడ జరిగిన భారీ నష్టాన్ని కొంతవరకైనా భర్తీ చేయడానికి ఐసీసీ చేస్తున్న కృషిని అతను అభినందించాడు. ఈ మహాయజ్ఞనంలో తనను చేర్చుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పాడు. ఇలావుంటే, వెస్టిండీస్ తరఫున బ్రాత్‌వెయిట్‌తోపాటు క్రిస్ గేల్, మార్లొన్ శామ్యూల్స్, శామ్యూల్ బద్రీ, ఆండ్రె రసెల్ వంటి స్టార్లు ఉన్నారు.