క్రీడాభూమి

సింగపూర్ జట్టును ఓడించడంతో మరింత విశ్వాసం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 19: గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో సింగపూర్ జట్టును ఓడించడం తమలో విశ్వాసాన్ని మరింత పెంచిందని, తద్వారా గోల్డ్ మెడల్ సాధించామని భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మధురికా పట్కర్ పేర్కొంది. జకార్తా, ఇండోనేషియాలలో ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి నిర్వహించనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మనీకా బాత్రాతో కలసి ఆమె పాల్గొననుంది. ఆసియా క్రీడల్లో చైనా, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, సింగపూర్, హాంగ్ కాంగ్, ఉత్తర కొరియాలకు చెందిన పెద్దపెద్ద టీమ్‌లు పోటీ పడనున్నాయని ఆమె పేర్కొంది.
అయితే, గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడంతో తమలో మరింత విశ్వాసం, నమ్మకం పెరిగిందని, ఇదే ఉత్సాహం, దూకుడుతో ఆసియా క్రీడల్లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటామన్న ధీమాను పట్కర్ వ్యక్తం చేసింది.
31 ఏళ్ల జాతీయ చాంపియన్ అయిన మధురిక గురువారం ఇక్కడ పీటీఐతో మాట్లాడుతూ కామనె్వల్త్ క్రీడలు ప్రారంభమైన 2002 నుండి ఇప్పటివరకు ప్రపంచంలో నాలుగో ర్యాంకింగ్‌లో ఉన్న సింగపూర్ వంటి పటిష్ట జట్టును భారత క్రీడాకారులు ఓడించలేకపోయారని, ఈ ఘనతను తాము దక్కించుకున్నామని తెలిపింది. ఇక భవిష్యత్‌లో జరిగే పోటీల్లో ఎలాంటి టీమ్‌లనైనా దీటుగా ఎదుర్కోగలమనే పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయని ఆమె పేర్కొంది. టేబుల్ టెన్నిస్ మహిళల వ్యక్తిగత విభాగంలో నాలుగు పతకాలు సాధించిన మనీకా భాత్రాను ఆమె అభినందించింది.