క్రీడాభూమి

డైమండ్ లీగ్‌పై నీరజ్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌త్రోయర్ నీరజ్ చోప్రా వచ్చేనెల 4 నుంచి దోహాలో జరుగునున్న డైమండ్ లీగ్ సిరీస్ మొదటి దశలో పతకంపై కనే్నశాడు. కామనె్వల్త్ క్రీడల్లో 86.47 మీటర్లు జావెలిన్‌ను విసిరి స్వర్ణ పతకం సాధించిన నీరజ్‌తో పాటు జర్మనీ కి చెందిన ఒలింపిక్ చాంపియన్ థామాస్ రోలార్, అదే దేశానికి చెందిన ప్రపంచ చాంపియన్ జానేస్ వేటార్ పాల్గొంటుండటంతో ఖతార్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగనున్న డైమండ్ లీగ్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.
2017 వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతకం విజేత, డైమండ్ లీగ్ నిరుటి చాంపియన్ చెక్ రిపబ్లిక్ దేశస్తుడు జాకాబ్ వాల్డెచ్, ప్రపంచ కాంస్య పతక విజేత, టీమ్‌మేట్ అయిన పీటర్ ఫ్రెడరిక్ లాంటి హేమాహేమీలు దోహాలో జరుగనున్న చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు. చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు నెలకొల్పిన 93.90 మీటర్ల రికార్డును అధిగమించగలనని రోలార్ ధీమా వ్యక్తం చేశాడు.
20 ఏళ్ల నీరజ్ 2016లో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 86.487 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. డైమండ్ లీగ్ సిరీస్‌లో నిరాజ్ మూడుమార్లు 86 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. గత సంవత్సరం నిర్వహించిన లీగ్‌లో నీరజ్ చోప్రా ఆరు పాయింట్లు సాధించి ఎనిమదో స్థానంలో నిలిచాడు. గత జూన్, జూలైలో పారిస్, మోనాకో లీగ్ సిరీస్‌లో నిరాజ్ ఐదు, అరు స్థానాలతో సరిపెట్టుకున్నాడు.