క్రీడాభూమి

లంక సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జయసూర్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఏప్రిల్ 12: శ్రీలంక సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య మళ్లీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌గా అరవింద డి సిల్వ వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది జయసూర్య సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన వెంటనే ఆ స్థానాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అధికారులు డి సిల్వతో భర్తీ చేశారు. అయితే, ఇటీవల లంక వరుస పరాజయాలతో అల్లాడుతున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్‌ఎల్‌సి చైర్మన్ తిలంగ సుమతిపాల కూడా ప్రస్తుత సెలక్షన్ కమిటీ పనితీరుపై అసంతృప్తితో ఉన్నాడని, అందుకే మళ్లీ జయసూర్యను తీసుకురావాలని యోచిస్తున్నాడని స్థానిక మీడియా ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు అనివార్యమవుతాయని సుమతిపాల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సెలక్షన్ కమిటీ చైర్మన్‌ను మార్చడం ద్వారా ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుడతారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలావుంటే, ఎస్‌ఎల్‌సి ఉపాధ్యక్షుడు మోహన్ డి సిల్వ మీడియాకు తెలిపిన సమాచారం ప్రకారం సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జయసూర్య, సభ్యులుగా మాజీ వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ రొమేష్ కలువితరణ, మాజీ ఆఫ్ స్పిన్నర్ రంజిత్ మదురసంఘ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ జయసూర్య ఇప్పుడు సెలక్షన్ కమిటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తే, అతను అదే పదవిలో 2019 వరల్డ్ కప్ పూర్తయ్యే వరకూ ఉంటాడు. 46 ఏళ్ల జయసూర్య తన కెరీర్‌లో 110 టెస్టులు, 445 వనే్డలు, 31 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2013 జనవరి నుంచి 2015 మార్చి వరకూ అతను జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సేవలు అందించాడు.