క్రీడాభూమి

మాంటేకార్లో టెన్నిస్ జొకోవిచ్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంటేకార్లో, ఏప్రిల్ 19: ఇక్కడ జరుగుతున్న మాంటేకార్లో టెన్నిస్ టోర్నమెంట్‌లో మూడో రౌండ్‌లోనే ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ పరాజయాన్ని ఎదు ర్కొని నిష్క్రమించాడు. డామినిక్ థియేమ్ 6-7, 2-6, 3-6 తేడాతో జొకోవిచ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మొదటి సెట్‌ను కైవసం చేసుకున్న జొకోవిచ్ అదే స్థాయలో రాణించలేక, మిగతా రెండు సెట్లను పేలవంగా ఆడి, కోల్పోవ డం గమనార్హం. చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న థి యేమ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. కాగా, బల్గేరియా స్టార్ గ్రెగర్ దిమిత్రోవ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మూడో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను ఫిలిప్ కొల్చర్బర్‌ను 4-6, 6-3, 6-4 తేడాతో ఓడించాడు. తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆతర్వాత మిగతా రెండు సెట్లను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. సెమీస్‌లో స్థానం కోసం అతను డేవిడ్ గోన్ఫిన్‌ను ఢీకొంటాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో గోన్ఫిన్ 6-4, 7-5 ఆధిక్యంతో రాబర్ట్ బటిస్టా అగట్‌పై విజయం సాధించాడు. జర్మనీ యువ సంచలన ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-4, 4-6, 6-4 తేడాతో జాన్ లెనార్డ్ స్ట్రక్‌పై గెలుపొంది క్వార్టర్స్ చేరాడు. కాగా, ఇదే రౌండ్‌లో మారిన్ సిలిక్‌తో తలపడాల్సిన మిలోస్ రోనిక్ అనారోగ్యం కారణంగా వైదొలిగాడు. వాకోవర్ లభించిన సిలిక్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు.