క్రీడాభూమి

శ్రీకాంత్.. డిప్యూటీ కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ నెంబర్ వన్ క్రీడాకారుడుగా రాణిస్తూ రెవెన్యూ శాఖలో డెప్యూటీ కలెక్టర్‌గా ఉండటం గర్వించదగిన విషయమని రాష్ట్ర భూ పరిపాలనశాఖ చీఫ్ కమిషనర్ (సీసీఎల్‌ఏ) అనీల్ చంద్ర పునేఠ పేర్కొన్నారు. గురువారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో కిడాంబి శ్రీకాంత్, గురువారం నియామకపు ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో సీసీఎల్‌ఏ మాట్లాడుతూ రాష్ట్రంతోపాటు దేశం గర్వపడే విధంగా రాణిస్తున్న ఆటగాడు శ్రీకాంత్ తన సేవలు రెవెన్యూ శాఖకు అందించడం గొప్ప విషయంగా భావిస్తున్నామన్నారు. శ్రీకాంత్ తదుపరి టోర్నమెంట్‌లో పాల్గొనటానికి రెవెన్యూశాఖ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. శ్రీకాంత్ కోరిక మేరకు డిప్యూటీ కలెక్టర్‌గా గుంటూరు జిల్లాకు కేటాయిస్తున్నట్లు సీసీఎల్‌ఏ తెలిపారు. ప్రపంచ నంబర్ వన్‌గా రాణించక పూర్వమే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాంత్ ప్రతిభను గుర్తించి డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారని రెవెన్యూ శాఖలో వచ్చిన తరువాత ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ ఆటగాడుగా రాణించడం గర్వించదగిన విషయమని సీసీఏ పునేఠ శ్రీకాంత్‌ను అభినందించారు. కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తననెంతో ప్రోత్సహించారని ఏపీ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ హోదాతో గుర్తించడం చాలా ఆనందంగా ఉందన్నారు. గుంటూరు జిల్లాలో పోస్టింగ్ కోరగా తనను గుంటూరు జిల్లాకు కేటాయించటం సీసీఎల్ కమిషనర్ అనీల్ చంద్ర పునేఠకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి తాను చైనాలో జరిగే పోటీలో పాల్గొంటున్నానని దేశంతో పాటు రాష్ట్రానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చే విధంగా పోరాడతానని శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మశ్రీ అవార్డుతో పాటు తాను పొందిన అవార్డులను సీసీఎల్‌ఏకు అందించారు.

చిత్రం..డిప్యూటీ కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులు అందుకుంటున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్