క్రీడాభూమి

ఎదురుదాడికి సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 12: తొమ్మిదో ఐపిఎల్ తొలి మ్యాచ్‌లోనే రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమైంది. నైట్ రైడర్స్ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. కాగితంపై చూస్తే బలంగా కనిపిస్తున్న నైట్ రైడర్స్‌కు ‘స్పిన్ మాంత్రికుడు’ సునీల్ నారైన్ చేరిక అదనపు బలాన్నిస్తోంది. వివాదాస్పదమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమైన అతను ఇటీవలే తన తండ్రి మృతి కారణంగా స్వదేశానికి వెళ్లాడు. అక్కడి కార్యక్రమాలను పూర్తి చేసుకొని మళ్లీ జట్టుతో కలిశాడు. అతని రాకతో నైట్ రైడర్స్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. గౌతం గంభీర్ నాయకత్వం వహిస్తున్న నైట్ రైడర్స్‌లో ఆస్ట్రేలియా వెటరన్ బౌలర్ బ్రాడ్ హాగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 19 పరుగులకే తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే, ఆ మ్యాచ్‌లో అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయిన జాన్ హాస్టింగ్స్‌ను తొలగించి, ఆ స్థానాన్ని సునీల్ నారైన్‌తో భర్తీ చేయాలన్న నిర్ణయానికి గంభీర్ వచ్చినట్టు సమాచారం. బ్యాటింగ్ విభాగానికి వస్తే గంభీర్‌తోపాటు రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఈ జట్టులో ఉన్నారు. యూసుఫ్ పఠాన్, ఆండ్రె రసెల్, షకీబ్ అల్ హసన్ తదితరులు ఆల్‌రౌండర్లుగా సేవలు అందిస్తున్నారు.
నైట్ రైడర్స్‌కు గట్టిపోటీనిచ్చే బలం రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబయికి ఉంది. లెండల్ సిమన్స్, జొస్ బట్లర్, అంబటి రాయుడు, ఉన్ముక్త్ చాంద్ తదితరులు ఈ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నారు. హార్దిక్ పాండ్య, హర్భజన్ సింగ్, వినయ్ కుమార్, మిచెల్ మెక్‌క్లీనగన్, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరన్ పోలార్డ్ స్పెషలిస్టు ఆల్‌రౌండర్‌గా మైదానంలోకి దిగుతాడు. మొత్తం మీద మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం గురించి ఆలోచించకుండా, బుధవారం నాటి మ్యాచ్‌లో రెచ్చిపోవాలని ముంబయి పట్టుదలతో ఉంటే, మొదటి విజయం కాకతాళీయంగా లభించింది కాదని నిరూపించుకోవడానికి నైట్ రైడర్స్ సర్వశక్తులు ఒడ్డనుంది. సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే ఈ పోరాటం అభిమానులను ఆకట్టుకోవడం ఖాయం.

టేలర్‌కు గుండె జబ్బు
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
లండన్, ఏప్రిల్ 12: ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ టేలర్ తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అతను గుడ్‌బై చెప్పాడు. కెరీర్‌లో 7 టెస్టులు, 27 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన టేలర్ ఇంగ్లీష్ కౌంటీలో నాటింహామ్‌షైర్ తరఫున ఆడాల్సిన అతను సర్రేతో జరిగిన మొదటి మ్యాచ్‌కి హాజరుకాలేదు. అనారోగ్యం కారణంగా అతను ఆసుపత్రిలో చేర్చగా, వైద్య పరీక్షలో గుండె జబ్బు బయటపడింది. అతనికి వెంటనే శస్త్ర చికిత్స చేయించాలని వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని టేలర్ ట్వీట్ చేస్తూ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నానన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని తెలిపాడు. టేలర్ ఏడు టెస్టుల్లో 312 (అత్యధిక స్కోరు 76), 27 వనే్డల్లో 887 (అత్యధిక స్కోరు 101), 139 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 9,306 (అత్యధిక స్కోరు 291) చొప్పున పరుగులు సాధించాడు.