క్రీడాభూమి

హోం గ్రౌండ్‌లో కోల్‌కతాకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఇక్కడి ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చుక్కెదురైంది. వర్షం కారణంగా ఆటకు ఆటంకం ఏర్పడిన ఈ మ్యాచ్‌ని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తొమ్మిది వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. లోకేష్ రాహుల్, క్రిస్ గేల్ అర్ధ సెంచరీలతో రాణించడంతో ఈ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ జట్టు 8.2 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాత, డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అనుసరించి పంజాబ్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 125 పరుగులుగా నిర్ణయించారు. అప్పటికే వికెట్ నష్టం లేకుండా 96 పరుగులు చేసిన పంజాబ్ బ్యాటింగ్‌ను ప్రారంభించి సులభంగానే లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలింగ్‌ను ఎంచుకోగా బ్యాటింగ్‌ను ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదిలోనే ఒక వికెట్‌ను కోల్పోయింది. ఫస్ట్ డౌన్‌గా దిగిన క్రిస్ లీన్, సునీల్ నరైన్‌లలో నాలుగు బంతులు ఎదుర్కొన్న నరైన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ముజీబ్ ఉర్ రహ్మాన్ బౌలింగ్‌లో కరణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అయితే, మరో ఓపెనర్ క్రిస్ లీన్ ఏమాత్రం తొణకుండా ధీటుగా ఆడుతూ మరో క్రికెటర్ రాబిన్ ఉతప్పతో కలసి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టీమ్‌లో క్రిస్ లీన్ ఒక్కడే అత్యధికంగా 74 పరుగులు చేయడం విశేషం.
రాబిన్ ఉతప్ప 23 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు బౌండరీల సహాయంతో 34 పరుగులు చేసి జట్టు స్కోరు 78 వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నితీష్ రాణా ఆశించిన పరుగులేమీ చేయలేదు. ఇతను ఐదు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. బ్యాటింగ్ ప్రారంభించిన తొలి నుంచీ సిక్సర్లు, బౌండరీలతో ఆకట్టుకున్న క్రిస్ లీన్ చివరికి ఆండ్రూ టై బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అతను 41 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఆరు బౌండరీల సాయంతో 74 పరుగులు చేశాడు. అప్పటి జట్టు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన ఆండ్రూ రస్సెల్ ఏడు బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 10 పరుగులు చేసి, బరీందర్ శరణ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్‌గా కూడా సేవలు అందిస్తున్న కెప్టెన్ దినేష్ కార్తీక్ చక్కటి ఇన్నింగ్ ఆడి, జట్టు స్కోరును మరింత వేగంగా ముందుకు నడిపాడు. మొత్తం 28 బంతులు ఎదుర్కొన్న అతను ఆరు బౌండరీలతో 43 పరుగులు చేసి, బరీందర్ శరణ్ బౌలింగ్‌లో ఆండ్రూ టైకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. టామ్ కూరన్ మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి, ఆండ్రూ టై బౌలింగ్‌లో అంకిత్ రాజ్‌పుత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శుభ్‌మాన్ గిల్ ఎనిమిది బంతులు ఎదుఠ్కొని రెండు బౌండరీలతో 14 పరుగులు, పీయూష్ చావ్లా రెండు బంతులు ఎదుర్కొని రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో బరీందర్ శరణ్ నాలుగు ఓవర్లలో 50 పరుగులిచ్చి రెండు వికెట్లు, ఆండ్రూ టై నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించారు. ముజీబ్ ఉర్ రహ్మాన్, కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చెరి ఒక వికెట్ తీసుకున్నారు.
కాగా, వర్షం వల్ల ఆటకు ఏర్పడిన ఆటంకాన్ని దృష్టిలో ఉంచుకుని 13 ఓవర్లుగా కుదించిన ఈ మ్యాచ్‌లో 125 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 11.1 ఓవర్లలోనే చేరుకుంది. ఆటను ప్రారంభించిన తొలి బంతికే పీయూష్ చావ్లా బౌలింగ్‌లో క్రిస్ గేల్ సిక్సర్‌ను బాది అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.
సునీల్ నరైన్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ సిక్సర్ కొట్టి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అనంతరం వరుసగా రెండు బౌండరీలు కొట్టిన రాహుల్ ఆ వెంటనే టామ్ కూరన్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 27 బంతులు ఎదుర్కొన్న అతను తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మయాంక్ అగర్వాల్‌తో కలసి గేల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. పంజాబ్ లక్ష్యాన్ని ఛేదించే సమయానికి అగర్వాల్ 2, గేల్ 62 (38 బంతులు, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
సంక్షిప్త స్కోరు
కోల్‌కతా నైట్ రైడర్స్: 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 (క్రిస్ లీన్ 74, రాబిన్ ఉతప్ప 34, దినేష్ కార్తీక్ 40, బరీందర్ శరణ్ 2/50, ఆండ్రూ టై 2/30).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (డక్‌వర్త్ లూయిస్ విధానంలో సవరించిన లక్ష్యం 13 ఓవర్లలో 125 పరుగులు): 11.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 126 (లోకేష్ రాహుల్ 60, క్రిస్ గేల్ 62 నాటౌట్, సునీల్ నరైన్ 1/23).

చిత్రం..కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న క్రిస్ గేల్