క్రీడాభూమి

హోం గ్రౌండ్‌లో నిలదొక్కుకునేందుకు ఢిల్లీ ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్‌లో ఆడుతున్న అన్ని జట్ల కంటే ఆఖరి స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ సోమవారం జరిగే తమ హోంగ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌లో గెలుపు ద్వారా నిలదొక్కుకోవాలని ఆరాటపడుతోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే మ్యాచ్‌పై పట్టు సాధించాలని ఢిల్లీ జట్టు తహతహలాడుతోంది. శనివారం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరు బౌండరీలు, ఏడు సిక్సర్లతో అత్యధికంగా 85 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ నాలుగు బౌండరీలు, ఆరు సిక్సర్లు చేసి, ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని బెంగళూరు జట్టు అతి సునాయాసంగా ఛేదించింది. ఈ జట్టులో ఏబీ డివిలియర్స్ అద్భుత ఫాంతో 10 బౌండరీలు, ఐదు సిక్సర్లతో 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, సోమవారం జరిగే తదుపరి మ్యాచ్‌పై పంజాబ్ జట్టుపై గట్టి పట్టు సాధించే దిశగా ఢిల్లీ సన్నద్ధమవుతోంది. అయితే, ఈ సీజన్‌లోని పట్టికలో ఢిల్లీ అన్ని జట్ల కంటే ఆఖరి స్థానంలో కొనసాగుతుండగా, ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న పటిష్టమైన బౌలింగ్, బ్యాటింగ్ వ్యవస్థ ఉన్న పంజాబ్‌ను ఢీకొనాలంటే ఈ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉండాల్సి ఉంటుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో (ముంబయి ఇండియన్స్‌పై) గెలుపుతో పాయింట్ల పట్టికలో కేవలం రెండు పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఈ జట్టు తన తొలి మ్యాచ్‌లో పంజాబ్, ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో ఆడిన మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. అయితే, ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే గంభీర్ సేన గెలిచింది. అది కూడా ఇంగ్లీష్ ఓపెనర్ జాసన్ రాయ్, భారత డైనమిక్ క్రికెటర్ రిషబ్ పంత్ జట్టును గెలిపించే బాధ్యతలను నిర్వర్తించారు. గత ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గౌతం గంభీర్ ఇపుడు ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా కీలక బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంచి స్కోరు సాధించడం ద్వారా మునుపటి ఫాంను సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. తమ జట్టులో ఇప్పటికే అద్భుతంగా రాణిస్తున్న రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్‌వెల్, ట్రెంట్ బౌల్ట్ వంటివారిని చక్కగా ఉపయోగించుకోవాలని గంభీర్ యోచిస్తున్నాడు.
నేటి మ్యాచ్
ఢిల్లీ డేర్ డెవిల్స్/కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
వేదిక: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం. సమయం: రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం.
(్ఢల్లీ జట్టు ఇంతవరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒకదాన్లో గెలుపొంది మిగిలిన నాలుగింట్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉంది. పంజాబ్ జట్టు ఇంతవరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింట్లో గెలుపు, ఒకదాన్లో ఓటమితో పట్టికలో 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది).