క్రీడాభూమి

రాజస్తాన్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 22: ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి సావల్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన పోరులో మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అందుకు ప్రతిగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రెండు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి లక్ష్యాన్ని అధిగమించింది. రాజస్తాన్ బౌలర్ జోఫ్రా ఆర్చెర్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. తొలి ఓవర్ నాలుగో బంతికే ఎవిన్ లూయిస్ రూపంలో మొదటి వికెట్‌ను కోల్పోయింది. లూయిస్ కేవలం ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ధవల్ కులకర్ణి చేతిలో బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 42 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, నాలుగు బౌండరీల సహాయంతో 58 పరుగులు చేసి ధవల్ కులకర్ణి బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 47 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఆరు బౌండరీల సహాయంతో 72 పరుగులు చేశాడు. ఇతను జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఒక బంతిని ఎదుర్కొని రనౌట్ అయ్యాడు. అప్పటికి జట్టు 15.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కృణాల్ పాండ్య ఆరు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఏడు పరులు చేశాడు. ఇతను జోఫ్రా ఆర్చెర్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. హార్థిక్ పాండ్య రెండు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో నాలుగు పరుగులు చేసి జోఫ్రా ఆర్చెర్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. మిచెల్ మెక్‌క్లీన్‌గన్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. ఇతనిని కూడా జోఫ్రా ఆర్చెర్ బౌల్డ్ చేశాడు. కీరన్ పొలార్డ్ 20 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీ సహాయంతో 21 పరుగులు, మయాంక్ మార్కండే ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచారు. ఇక రాజస్తాన్ జట్టులో జోఫ్రా ఆర్చెర్ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ధవల్ కులకర్ణి నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి రెండు వికెట్లు, జయదేవ్ ఉనద్కత్ నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. ప్రత్యర్థి జట్టు తమ మందు ఉంచిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది మరో విజయాన్ని తన ఖాతాలో జమచేసుకుంది. ఈ జట్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ త్రిపాఠి ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో తొమ్మిది పరుగులు చేసి కృణాల్ పాండ్య బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే 17 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 14 పరుగులు చేశాడు. మెక్‌క్లీన్‌గన్ బౌలింగ్‌లో కృణాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి రహానే వెనుతిరిగాడు. బెన్ స్టోక్స్ 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 40 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. సంజూ శాంసన్ 39 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో హార్థిక్ పాండ్య చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ముస్త్ఫాజుర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. జోఫ్రా ఆర్చెర్ తొమ్మిది బంతుల్లో ఒక ఫోర్‌తో ఎనిమిది పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కృష్ణప్ప గౌతమ్ 11 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 33 పరుగులు, జయదేవ్ ఉనద్కత్ పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచాడు.
ఇక ముంబయి జట్టులో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి రెండు వికెట్లు, హార్థిక్ పాండ్య 2.4 ఓవర్లలో 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. మిచెల్ మెక్‌క్లీన్‌గన్ మూడు ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒక వికెట్, కృణాల్ పాండ్య నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్, ముస్త్ఫాజుర్ రహ్మాన్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించారు.
సంక్షిప్త స్కోరు:
ముంబయి ఇండియన్స్: 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 (సూర్యకుమార్ యాదవ్ 72, ఇషాన్ కిషన్ 58, కీరన్ పొలార్డ్ 21, జోఫ్రా ఆర్చెర్ 3/22, ధవల్ కులకర్ణి 2/32).
రాజస్తాన్ రాయల్స్: 19.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 (సంజూ శాంసన్ 52, బెన్ స్టోక్స్ 40, కృష్ణప్ప గౌతమ్ 33, జస్ప్రీత్ బుమ్రా 2/28, హార్థిక్ పాండ్య 2/25).

చిత్రాలు..బౌలింగ్‌లో రాణించిన జోఫ్రా ఆరె చర్ (3/22)
*ముంబయి ఇండియన్స్‌పై గెలుపు ఆనందంలో రాజస్తాన్ క్రికెటర్లు