క్రీడాభూమి

చెన్నై చెత్త రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 11లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. సన్‌రైజర్స్ బౌలర్లు చక్కటి బౌలింగ్ పటిమను ప్రదర్శించడంతో ఈ సీజన్‌లో తొలి పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన మొదటి జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు పవర్‌ప్లేలో భాగంగా ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది.
ఈ సీజన్‌లో పవర్‌ప్లే ముగిసేసరికి అత్యల్ప స్కోరు సాధించిన జట్టుగా అప్రతిష్టను సొంతం మూటకట్టుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్, బిల్లీ స్టాన్ లేక్, రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్ తమదైన శైలిలో బౌలింగ్ వేయడంతో చెన్నై ఆటగాళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా ఆదివారం బెంగళూరుతో జరిగిన ఢిల్లీ డేర్‌డేవిల్స్ తొలి పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై పవర్‌ప్లే గేమ్‌లో కేవలం 27 పరుగులు చేసి చెత్త రికార్డును తన ఖాతాలో చేర్చుకుంది.

చిత్రం..మూడు వికెట్లు తీసిన చెన్నై పేసర్ చాహర్