క్రీడాభూమి

సన్‌రైజర్స్‌పై గెలుపు కోసం ముంబయి ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 23: ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒకదాన్లో విజయం సాధించి, మిగిలిన మ్యాచ్‌లలో ఓటమిపాలైన ముంబయి ఇండియన్స్ స్వంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఆరాటపడుతోంది. ముంబయి టీమ్ ఒకే ఒక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలై మొత్తం నాలుగు మ్యాచ్‌లలో పరాజయాన్ని చవిచూసింది. కనీసం ఏడు మ్యాచ్‌లలోనైనా గెలిస్తే ఈ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటుంది. ముంబయిలో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఆటతీరుతో జట్టును ఆదుకుంటున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో అతను ఆడిన మ్యాచ్‌ల ద్వారా 200 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 94 పరుగులతో జట్టును గెలిపించే బాధ్యతలను మోసినా ఆ తర్వాత ఆడిన మ్యాచ్‌లలో అనుకున్నంత స్థాయిలో పరుగులు చేయలేకపోయాడు. రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టులో ఉత్సాహాన్ని నింపితే మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు దూకుడుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ జట్టులో వెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ ఇంతవరకు ఆడిన ఐదు గేమ్‌లలో కేవలం 54 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ట్రినిడాడ్ ఆటగాడు ఎవిన్ లూయిస్, పాండ్య బ్రదర్స్ సైతం అంతగా ఆశించిన రీతిలో రాణించడంలేదు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ముస్త్ఫిజుర్ వంటివారు జట్టును తమ బౌలింగ్ ద్వారా అడపా దడపా మెరుస్తున్నా విజయానికి బాటలు వేయలేకపోతున్నారు.
ఇక సన్‌రైజర్స్ ఇంతవరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించినా అందర్నీ ఆకట్టుకున్నా, గడచిన రెండు మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ తన స్థానాన్ని పదిలపరచుకోవాలంటే హైదరాబాద్ జట్టుకు మంగళవారం నాడు ముంబయితో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. సన్‌రైజర్స్ పంజాబ్, చెన్నై జట్లతో వరుసగా ఆడిన మ్యాచ్‌లలో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని తమ తదుపరి పోరులో ముంబయిపై గెలుపు కోసం ఉవ్విళ్లూరుతోంది. ఈ జట్టు కెప్టెన్ కనే విలియమ్‌సన్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో 230 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నాడు. అయితే, మిగిలిన బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్ ధావన్, గడచిన మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్, శ్రేయాస్ గోస్వామి కొంతవరకు జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నా మిగిలిన బౌలర్లు కూడా రాణిస్తే సన్‌రైజర్స్‌లో రైజింగ్‌లో ముందుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు.