క్రీడాభూమి

బీసీసీఐ కోర్టులో బంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 23: భారత్-పాక్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను కొనసాగించడం అనే అంశం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నతాధికారి నజమ్ సేథీ పేర్కొన్నాడు. ఇక్కడ పీటీఐతో ఆయన మాట్లాడుతూ ఇరుగుపొరుగు దేశాలు, భద్రతా అంశాలు సామాజిక, రాజకీయ అంశాలు సిరీస్‌కు అవరోధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ అంశం ఇపుడు బీసీసీఐ పరిధిలో ఉందని, ఇరు దేశాల మధ్య సిరీస్ జరగాలా? వద్దా? అనే అంశం భారత ప్రభుత్వం అనుమతించేదానిపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. వాస్తవానికి ఉభయ దేశాలు 50 ఓవర్లు కలిగిన ప్రపంచ కప్, చాంపియన్ ట్రోఫీ, వరల్డ్ టీ-20 లేదా ఆసియా కప్‌లో ఆడాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. అయితే, ముందుగా ఉపఖండంలోని రెండు దేశాల క్రికెటర్లు ఆడాలనే నిర్ణయానికి రావాల్సి ఉంటుందని, ఇది జరగాలంటే బీసీసీఐదే తుది నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డాడు. రానున్న రోజుల్లో ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడడం ద్వారా మళ్లీ క్రికెట్ ఆడేందుకు మార్గం సుగమం కాగలదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు. 2015, 2023 సంవత్సరాల మధ్య ఇరు దేశాల జట్లు ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని 2014లో జరిగిన ఒక ఒప్పందాన్ని భారత్ అతిక్రమించినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 70 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఇరు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ పోటీలు జరగాలని అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారని, ఈ సమస్య త్వరితగతిన పరిష్కారం కాగలదనే చాలామంది విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. చీటింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటి అంశాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా స్పష్టం ఉందని అంటూ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన ఇద్దరు, ముగ్గురు క్రికెటర్లపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు.
వీసా నిబంధనలపై సేథీ గరం గరం
కోల్‌కతాలో జరుగుతున్న ఐసీసీ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన తనకు భారతదేశ వీసా నిబంధనలు అవస్థకు గురిచేశాయని పాక్ క్రికెట్ బోర్డు ముఖ్య అధికారి నాజమ్ సేథీ ఆరోపించాడు. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు. వాస్తవానికి లాహోర్ నుంచి కోల్‌కతాకు రావడానికి కేవలం రెండు గంటలు పడుతుందని, కానీ భారత వీసీ నిబంధనల కారణం వల్ల 19 గంటల సమయం పట్టిందని, ఇది తనకు ఎంతో ఇబ్బంది, అసంతృప్తికి గురిచేసిందని ఆయన అన్నాడు. ఇదిలావుండగా, పీసీబీ ఉన్నతాధికారి నాజమ్ సేథీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఆయన పీటీఐతో మాట్లాడుతూ సేథీ కోల్‌కతాలో జరిగే సమావేశానికి మాత్రమే వచ్చినందున, అతనికి నిబంధనల ప్రకారం ఒక నగర పర్యటనకు సంబంధించిన వీసా మంజూరైందని స్పష్టం చేశాడు. కానీ సేథీ లాహోర్ నుండి దుబాయ్ మీదుగా న్యూఢిల్లీ అక్కడి నుంచి కోల్‌కతా వచ్చిన విషయం వాస్తవమని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఇరు దేశాల ప్రజలకు కూడా నిర్ధిష్ట ప్రక్రియ ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. ఎవరైనా భారతీయులు పాక్ వెళ్లాలంటే ఈ నిర్ధిష్ట ప్రక్రియకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందనేది వాస్తవమని ఆయన పేర్కొన్నాడు.