క్రీడాభూమి

2019 వరల్డ్ కప్ తర్వాతే రిటైర్మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటానని, అప్పటివరకు దేశవాలీ క్రికెట్ అడుతానని భారత జట్టు క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు.
గత సంవత్సరం వెస్టిండీస్‌తో జరిగిన వనే్డ జట్టు భారత్‌కు చివరిసారి ప్రాతిధ్యం వహించాడు. అయితే ఇంగ్లాండ్, వేల్స్‌లో జరుగనున్న 2019 వనే్డ వరల్డ్ కప్ వరకూ తన కెరీర్‌ను కొనసాగించనున్నట్లు వెల్లడించాడు. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన 36 ఏళ్ల యువరాజ్ 17, 18 ఏళ్లపాటు భారత జట్టుకు ఆడుతూ క్రికెట్‌ను అస్వాదించాడు. ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సి ఉంటుందని, అది తప్పదని చెప్పాడు.
టీమిండియా 2011 వనే్డ వరల్డ్ కప్ సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌లో యువీ భారత్ కప్పుగెలవడంలో కీలక పాత్ర పోషించినా 2015 వరల్డ్ కప్‌లో ఆడే ఆవకాశం దక్కలేదు. 90.50 బ్యాటింగ్ సగటుతో ఆ మెగా టోర్నమెంట్‌లో 362 పరుగులతో పాటు బౌలింగ్‌లో రాణించి 15 వికెట్లు తీసుకుని ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. కొంతకాలం పాటు క్యాన్సర్‌తో బాధపడిన యువరాజ్ కోలుకున్న తర్వాత అంతగా రాణించలేకపోతున్నాడు.
ఇదిలావుండగా, టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో తన సహచరుడు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లలో క్రిస్ గేల్ ఒకడని, అతడు రాణించడంతో ఐపీఎల్ 11 సీజన్‌లో పంజాబ్ గెలపుబాటలో పడిందన్నాడు. ఐపీఎలలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పటిష్ట జట్లు అని, ఆ జట్లకు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పాడు.