క్రీడాభూమి

సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ సింధు ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 13: సింగపూర్ ఓపెన్ సూపర్ సింగ్ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి పివి సింధు ముందంజ వేసింది. బుసానన్ ఆంగ్‌బమ్‌రంగ్‌తో జరిగిన మ్యాచ్‌ని ఈ హైదరాబాదీ 9-21, 21-17, 21-11 తేడాతో గెల్చుకుంది. మరో స్టార్ సైనా నెహ్వాల్ కాలి మడమ గాయం కారణంగా చివరి క్షణాల్లో పోటీ నుంచి వైదొలగ్గా సింధుపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇలావుంటే, పురుషుల సిగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, అజయ్ జయరామన్, కిడాంబి శ్రీకాంత్ తమతమ మొదటి రౌండ్లలోనే పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించారు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు చెన్ లాంగ్‌తో తలపడిన ప్రణయ్ చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. చెన్ లాంగ్ 18-21, 21-18, 21-19 తేడాతో విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో మార్క్ జ్వెబ్లర్‌తో తలపడిన అజయ్ జయరామ్ 17-21, 16-21 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. కిడాంబి శ్రీకాంత్‌పై సూ జెన్ హవో 11-21, 21-18, 21-18 తేడాతో గెలిచాడు. మహిళల డబుల్స్ విభాగంలో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ కూడా నిష్క్రమించింది. వీరిపై గో ఆ రా, యూ హయే వాన్ జోడీ 21-18, 21-16 ఆధిక్యంతో గెలుపొందింది.

అజ్లన్ షా హాకీ టోర్నమెంట్
కివీస్ చేతిలో భారత్ ఓటమి

ఇపో (మలేసియా), ఏప్రిల్ 13: ప్రతిష్ఠాత్మక అజ్లన్ షా హాకీ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరుకునే అవకాశాలను సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు సంక్లిష్టం చేసుకుంది. మంగళవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసిన భారత్ బుధవారం డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్‌తో తలపడి 1-2 తేడాతో ఓటమిపాలైంది. కివీస్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ తీవ్రంగానే శ్రమించింది. మ్యాచ్ 28వ నిమిషంలో కెన్ రసెల్ ద్వారా న్యూజిలాండ్‌కు మొదటి గోల్‌రాగా, 36వ నిమిషంలో మన్దీప్ సింగ్ భారత్‌కు ఈక్వెలైజర్‌ను అందించాడు. అయితే, మరో ఐదు నిమిషాల్లోనే నిక్ విల్సన్ గోల్ సాధించి, న్యూజిలాండ్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం కివీస్ రక్షణాత్మకంగా ఆడుతూ, అదే తేడాతో విజయాన్ని నమోదు చేసింది. కాగా, పరాజయంతో భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలకు గండిపడింది. శుక్రవారం మలేసియాతో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఓడితే భారత్‌కు ఫైనల్ చేరే దారులు మూసుకుపోతాయి.